దిన ఫలాలు (మార్చి 30, 2024): ఆ రాశి ఉద్యోగులకు పై అధికారుల ప్రశంసలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Mar 30, 2024 | 5:01 AM

Horoscope Today: మేషరాశి వారికి శనివారంనాడు ఆదాయం బాగానే ఉన్నా అనవసర ఖర్చులు పెరుగుతాయి. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే సూచనలున్నాయి. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దిన ఫలాలు (మార్చి 30, 2024): ఆ రాశి ఉద్యోగులకు పై అధికారుల ప్రశంసలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 30th March 2024
Follow us on

దిన ఫలాలు (మార్చి 30, 2024): మేషరాశి వారికి శనివారంనాడు ఆదాయం బాగానే ఉన్నా అనవసర ఖర్చులు పెరుగుతాయి. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే సూచనలున్నాయి. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాల రీత్యా ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. ఆదాయం బాగానే ఉన్నా అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. బంధు వర్గంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో సంతృప్తికరంగా లాభాలుంటాయి. ఉద్యోగుల మీద భారం పెరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు కొద్ది శ్రమతో చదువుల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే సూచనలున్నాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

పెళ్లికి సంబంధించి బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పురోగతి సాధిస్తారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారపరంగా ఇప్పుడు తీసుకునే కొన్ని నిర్ణయాలు బాగా అనుకూల ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక వ్యవహారాలపై దృష్టి సారిస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. శుభ కార్యాలకు, ప్రముఖుల కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొం టారు. కుటుంబ సభ్యులతో హ్యాపీగా కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో అవకాశాలు పెరిగి, బాగా బిజీ అయిపోతారు. ఉద్యోగ జీవితం సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగం మారడానికి ఇది బాగా అనుకూల సమయం. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆర్థిక పరిస్థితి ఎంతో ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రులతో సఖ్యత, సయోధ్య పెరుగుతాయి. కుటుంబ, ఆర్థిక వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఆర్థిక ప్రతిఫలం ఉంటుంది. ఉద్యో గులకు బరువు బాధ్యతలు పెరిగి విశ్రాంతి కరవవుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఖర్చులు పెరుగుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

తొందరపాటుతో వ్యవహరించడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు పడ తారు. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఆధ్యా త్మిక చింతన పెరుగుతుంది. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. చేపట్టిన పనులు, వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

సర్వత్రా గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆస్తి వివాదం ఒకటి ఒక కొలిక్కి వస్తుంది. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. వాహన యోగం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఏమాత్రం తీరిక ఉండదు. ఉద్యోగంలో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగులకు కూడా ఆఫర్లు అందుతాయి. ఆహార, విహా రాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కొందరు బంధు మిత్రుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయటా శ్రమాధిక్యత కారణంగా కొన్ని పనులు వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలకు అవకాశముంది. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగులకు అధికారులతో సామ రస్యం పెరుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. శుభ కార్యానికి ప్లాన్ చేస్తారు. అనుకోకుండా బాగా డబ్బు కలిసి వస్తుంది. రావలసిన డబ్బు కూడా చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరుగుతుంది. ఉద్యోగులు తమ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. స్నేహితుల వల్ల ఆర్థి కంగా నష్టపోయే అవకాశముంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. ముఖ్య మైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఉన్నతాధికారుల నుంచి ఒకటి రెండు శుభ వార్తలు అందు కుంటారు. ఆర్థికంగా బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపో తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అవాంతరాలు, ఆటంకాలు లేకుండా ప్రతి ప్రయత్నమూ నెర వేరుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి శుభ కార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు సాను కూలంగా, సామరస్యంగా సాగిపోతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

సొంత పనుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక పరిస్థితి బాగా ఆశాజనకంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. మంచి పరిచయాలు కలుగుతాయి. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశిం చిన అభివృద్ధి కనిపిస్తుంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం పరవా లేదు.