Horoscope Today: కుటుంబీకుల నుంచి ఆ రాశి వారికి ఆర్థిక ఒత్తిడి .. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు

| Edited By: Ravi Kiran

May 29, 2024 | 7:47 AM

దిన ఫలాలు (మే 29, 2024): మేష రాశి వారికి కొందరు మిత్రుల వల్ల ఊహించని సమస్యలు తలెత్తుతాయి. వృషభ రాశి వారు చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. మిథున రాశి వారికి శత్రు, రోగ, రుణ బాధలు అదుపులో ఉంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: కుటుంబీకుల నుంచి ఆ రాశి వారికి ఆర్థిక ఒత్తిడి .. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు
Horoscope Today 29th May 2024
Follow us on

దిన ఫలాలు (మే 29, 2024): మేష రాశి వారికి కొందరు మిత్రుల వల్ల ఊహించని సమస్యలు తలెత్తుతాయి. వృషభ రాశి వారు చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. మిథున రాశి వారికి శత్రు, రోగ, రుణ బాధలు అదుపులో ఉంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత తప్పదు. కొందరు మిత్రుల వల్ల ఊహించని సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ముఖ్యంగా వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం అనుకూలంగా గడిచిపో తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉపయోగకర మైన పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయప్రయాసలు ఎక్కువగా ఉంటాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారాల పట్ల శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. పిల్లలకు ఆశించిన అవకాశాలు అందుతాయి. ఆస్తి సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవు తాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఇష్టమైన బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. శత్రు, రోగ, రుణ బాధలు అదుపులో ఉంటాయి. అన్ని రంగాల వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో కొందరు ఆప్తులు సహాయపడతారు. ఉద్యో గులు ఉన్నత పదవులు పొందే అవకాశముంది. చాలా కాలంగా మానసిక ఒత్తిడి కలిగి స్తున్న ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం నుంచి బయటపడే అవకాశముంది. రావలసిన డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కొద్ది వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవు తాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాల బాట పడతారు. కుటుంబ సభ్యు లతో ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో సత్ఫలితాలనిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, వ్యాపారాలు పురోగతి సాధించడానికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు అధి కారులతో సామరస్యం పెరుగుతుంది. మాట విలువ పెరుగుతుంది. అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. నిరుద్యోగులు అరుదైన అవకాశాలు అంధుకుంటారు. బంధువులతో మాట పట్టింపు లుంటాయి. అనారోగ్యాలకు ఆస్కారం లేదు. ప్రయాణాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

కుటుంబ సమేతంగా శుభ కార్యాలు, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. స్థిరాస్తి కొనడానికి అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యుల నుంచి ధనపరంగా ఒత్తిడి ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆస్తి వ్యవహారాలు లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. తల్లితండ్రుల సహాయంతో కుటుంబ సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. వ్యాపారాలు సానుకూలంగా సాగి లాభాలు పొందుతారు. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు ఆదాయపరంగా బాగా కలిసి వస్తుంది. ఒకరిద్దరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేపట్టినా విజయాలు సాధిస్తారు. ఆస్తికి సంబంధించి ముఖ్య మైన సమాచారం అందుతుంది. ప్రముఖులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. గృహ, వాహనాల కొనుగోలుపై దృష్టి పెడతారు. చిన్ననాటి మిత్రులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపా రాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

జీవిత భాగస్వామితో కలిసి భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పెండింగ్ పనులన్నీ చాలా వరకు పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుం టారు. కుటుంబసమేతంగా పుణ్య క్షేత్రం సందర్శిస్తారు. సోదరులతో సఖ్యత, సామరస్యం పెరుగు తాయి. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభి స్తుంది. వృత్తి, వ్యాపారాలు బలం పుంజుకుంటాయి. ఉద్యోగంలో ఆశించిన శుభవార్తలు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ అవకాశాలు బాగా మెరుగుపడతాయి. అనుకోకుండా కొన్ని శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుం టాయి. పదోన్నతికి కూడా అవకాశం ఉంది. ఆశించిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మాటలు, చేతలకు విలువ పెరుగుతుంది. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి అవుతాయి. ఆహార, విహారాల్లో వీలైనంతగా జాగ్రత్తలు పాటించడం మంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఇంటా బయటా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో సమస్యలు తగ్గి అనుకూల తలు పెరిగే అవకాశముంది. కొందరు బంధువులతో సమస్యలు తలెత్తుతాయి. ఆదాయం నిల కడగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగులు తమ ప్రయత్నాలను పెంచాల్సి ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

కొందరు ప్రముఖులతో లాభసాటి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ పరిస్థితులు ఒక కొలిక్కి వస్తాయి. బంధుమిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణ యాలు, మొదలెట్టే ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఉద్యో గంలో ఒడిదుడుకులను అధిగమిస్తారు. మొత్తం మీద అన్ని రంగాల వారికి అనుకూలమైన రోజు ఇది. కుటుంబపరంగా అనుకోకుండా కొన్ని శుభవార్తలు వింటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.