దిన ఫలాలు (ఆగస్టు 29, 2024): మేష రాశికి చెందిన వ్యాపారులకు ఈ రోజు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృషభ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఉత్సాహపరుస్తాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. మిథున రాశి వారికి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఇష్టమైన బంధువులను, చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబ వ్యవహారాలను చక్క దిద్దడం మీద దృష్టి పెడతారు. జీవిత భాగస్వామితో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పట్టే అవకాశం ఉంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయా నికి లోటుండదు కానీ, ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
కొందరు బంధువులతో అకారణంగా మాట పట్టింపులు తలెత్తుతాయి. ప్రయాణాల్లో విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. తల్లితండ్రుల్లో ఒకరికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహపరుస్తాయి. వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. ఆదాయం వృద్ది చెందే అవకాశం ఉంది. అనుకున్న పనులన్నీ పూర్తవు తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు, పలుకుబడి పెరుగుతాయి. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో విజ యం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలను విస్తరించాలన్న ఆలోచన చేస్తారు. ఉద్యోగంలో ఒడిదుడు కుల్ని అధిగమిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
కొందరు ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. కీలక వ్యవహారాల్లో పెద్దల సల హాలను తీసుకోవడం మంచిది. ఉద్యోగ, వ్యాపారాల్లో కొందరు ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందజేస్తారు. కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి సమ యం బాగా అనుకూలంగా ఉంది. వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి, ఉద్యో గాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఇంటా బయటా బాధ్యతలు, పని భారం పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన పనుల్లో కొద్దిపాటి అవరోధాలు ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాలు నిదానంగా, నిలకడగా సాగుతాయి. ఉద్యో గంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ఆదాయం బాగానే వృద్ధి చెందే అవకాశం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా సాగుతాయి. బంధువులతో మాట పట్టింపులకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా, ఆశాజన కంగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు సవ్యంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3)
ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారులకు పెట్టుబడులకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. సోదరులతో కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ఆదాయ లాభం ఉంటుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృథా ఖర్చులు తగ్గించుకోవలసిన అవసరం ఉంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఇష్టమైన బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలంగా, లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారులకు మీ పనితీరు సంతృప్తికరంగా ఉంటుంది. మిత్రులకు సహాయ సహకారాలు అంద జేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొందరు బంధువుల వల్ల మోస పోయే అవకాశం ఉంది. చేపట్టిన పనులన్నీ నిదానంగా, సవ్యంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపా రాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కొందరు సన్నిహితు లకు ఆర్థికంగా అండగా నిలబడతారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో కొద్దిగా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. పిల్లలు ఘన విజయాలు సాధి స్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ప్రతి విషయంలోనూ శ్రమకు తగ్గ ప్రతిఫలం కనిపిస్తుంది. చేపట్టిన పనులు సవ్యంగా, సకాలంలో పూర్తవుతాయి. కొందరు మిత్రుల నుంచి కొద్దిగా ఇబ్బందులుంటాయి. ఆరోగ్య సమస్యలు తగ్గు ముఖం పడతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ముఖ్యమైన ప్రయత్నాలు కొద్ది శ్రమతో నెరవేరుతాయి. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అవసర సమయాల్లో బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహకాలు, ప్రతిఫలాలు అందుకుంటారు. కుటుం బంలో శుభ కార్యాలు ప్లాన్ చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రు లతో కాలక్షేపం చేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. కొన్ని ముఖ్యమైన వ్యవహా రాల్లో జీవిత భాగస్వామి సలహాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
చేపట్టిన పనులన్నీ సజావుగా సాగిపోతాయి. ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ, అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇంటా బయటా బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పిల్లలకు చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి విహార యాత్ర చేయడం జరుగుతుంది. వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..