Horoscope Today(October 29 th 2021): ఈరోజుకు కొందరు తాము ఏ పని మొదలు పెట్టాలన్నా.. వస్తువులు కొనాలన్నా మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. ఈరోజు తమ నక్షత్ర బలం ఎలా ఉంది.. రాశిఫలాలు ఎలా ఉన్నాయో అంటూ దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు శుక్రవారం (అక్టోబర్ 29వ తేదీ) రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రాశివారు ఈరోజు కుటుంబ సభ్యులతో బంధు మిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్తలనులను ప్రారంభిస్తారు. వాహన యోగం ఉంది. వ్యాపారం, ఉద్యోగ రంగాల్లో ఉన్నత స్థితికి వెళ్లారు.
వృషభ రాశి: ఈ రాశివారికి ఈరోజు వ్యాపార రంగంలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆశయాలు నెరవేరతాయి.
మిధున రాశి: ఈరాశివారికి ఈరోజు చేపట్టిన పనుల్లో అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. ప్రముఖ పరిచయాలతో లభిస్తాయి. ధనలాభం కలుగుతుంది. ఉద్యోగస్థులకు బదిలీ అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం రంగంలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.
కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు ప్రతికూల పరిస్థితిలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అధిక శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. అప్పు చేయాల్సి వస్తుంది.
సింహ రాశి: ఈరాశివారు ఈరోజు ఋణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. బంధు మిత్రులతో శత్రుత్వం ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదావేయాల్సి వస్తుంది. ఉద్యోగ విషయంలో గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఉద్యోగస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధిక ఖర్చులు చేస్తారు. చేపట్టిన పనులల్లో ఆటంకాలు ఏర్పడతాయి. సోదరులతో ఆస్తుల విషయంలో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారి కుటుంబంలో ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి. వ్యాపార విషయంలో లాభాలను పొందుతారు. ఉద్యోగ విషయంలో కలిసి వస్తాయి.
వృశ్చిక రాశి: ఈ రాశివారు ఈరోజు కుటుంబంలో సమస్యలు వేధిస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. అధిగ శ్రమ చేయాల్సి ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు. గజిబిజి ఆలోచనలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగ, వ్యాపార రంగాలు సాధారణంగా ఉంటాయి.
ధనుస్సు రాశి: ఈరోజు ఈ రాశి వారు ఆరోగ్యం పరంగా ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యయప్రయాసలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
మకర రాశి: ఈరోజు ఈ రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కొత్త వాహనాలు, భూములను కొనుగోలు చేస్తారు. స్నేహితుల నుంచి శుభవార్త వింటారు.
కుంభ రాశి: ఈరాశి వారు ఈరోజు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పాతబాకీలు వసూలవుతాయి. సంఘంలో ఆదరణ సొంతం చేసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు.
మీన రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు చేస్తారు. శ్రమకు తగిన ఫలితం దక్కదు.
Also Read: శ్రీవారి భక్తులకు గమనిక.. నవంబర్ 4 న స్వామివారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..