Horoscope Today (November 29-11-2021): చాలా మంది ఈరోజు తమకు ఎలా ఉంది. ఆరోగ్యం , విద్య, వ్యాపార విషయాల్లో మంచి జరుగుతుందా.. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయా అని ఆలోచిస్తారు. అంతేకాదు వెంటనే తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (నవంబర్ 29 వ తేదీ ) సోమవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేష రాశి: ఈ రోజు ఈరాశివారు చేపట్టిన పనులను ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనం వలన అనారోగ్యాన్ని పొందుతారు. అనవసర భయాందోళనకు గురవుతారు. అబద్ధాలకు దూరంగా ఉండడం మంచిది.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారికి కుటుంబ విషయంలో సంతోషంగా ఉంటారు. అనుకోని లాభాలను అందుకుంటారు. అనారోగ్యానికి గురవుతారు. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. విదేశీ యానాం ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు మనోద్వేగానికి గురవుతారు. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం మంచిది కాదు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా మేలు చేస్తుంది. భోజనం వలన అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కొత్తపనులను వాయిదా వేసుకోవడం మంచిది.
కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు కొత్తపనులను వాయిదా వేసుకుంటారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణాలు అధికంగా చేస్తారు. మానసికంగా ఆందోళన నెలకొంటుంది.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది. విందు వినోదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంది.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు స్త్రీల వలన లాభం కలుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పాడతాయి. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు. బంధుమిత్రులను గౌరవిస్తారు. మంచి పనుల్లో పాల్గొంటారు.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు ఏర్పడే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారికి ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు. రుణ ప్రయత్నాలు చేస్తారు. స్థిరమైన నిర్ణయాలను తీసుకోలేరు. ఇతరుల విమర్శలను ఎదుర్కొంటారు. అనుకూల స్దాన చలనం కలిగే అవకాశాలు ఉన్నాయి
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ఆకస్మికంగా ధన నష్టం ఏర్పడకుండా ఉండడం మంచిది. అనారోగ్య బాధలు అధిమించడానికి అధికంగా డబ్బుని ఖర్చు చేస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్త్రీలు మనోఉల్లాసాన్ని పొందుతారు. ప్రయాణాల్లో అధిక ప్రయాస ఏర్పడతాయి.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. బంధు మిత్రులతో కలుస్తారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు ఇంటిలో మార్పులు కోరుకుంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. చేపట్టిన పనులు నెరవేరతాయి. కొన్ని పనులు వాయిదా చేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మీన రాశి: ఈరోజు ఈరాశి వారు ప్రయాణాలు అధికంగా చేస్తారు. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం. ఋణలాభం పొందుతారు. చేపట్టిన పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. స్వల్ప అనారోగ్యంతో బాధపడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.