Today Horoscope: చాలామంది జీవితంలో ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఇబ్బందుల్లో పడుతుంటారు. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు చేపట్టాలన్నా కొందరు తమ జాతకాలు, రాశిఫలాలను (Horoscope) అనుసరిస్తుంటారు. ఈ క్రమంలో శనివారం (మే 28న ) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేషం: ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
వృషభం: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా చేస్తుంది. సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
మిథునం: ఈ రాశి వారు లక్ష్యాలను చేరుకునేందుకు ఎక్కువగా కష్టపడాలి. పలు సేవా, విందు కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త ధైర్యాన్ని నింపుతుంది.
కార్కాటకం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భవిష్యత్తు కోసం చేసే వ్యూహాలు చేస్తారు. శుభ కార్యక్రమాలలో కుటుంబసభ్యులతో కలిసి పాల్గొంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది.
సింహం: ఈ రాశి వారికి ఆశించిన ఫలితాలు వస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆకట్టుకుంటారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు.
కన్య: ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు కనిపిస్తాయి. అయినప్పటికీ పట్టుదలతో వాటిని పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం మంచిది.
తుల: ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయభేదాలు వచ్చే అవకాశముంది. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది.
వృశ్చికం: ఈ రాశి వారికి శుభకాలం. ఎప్పటినుంచో పూర్తికాని పనులు ఈ రోజు పూర్తవుతాయి. కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు పెరుగుతాయి.
ధనుస్సు: సమాజంలో మంచి గౌరవం ఏర్పడుతుంది. మనస్సును ప్రశాంతత లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
మకరం: కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అందరి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు.
కుంభం: శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. సమయానికి ఆర్థిక సాయం చేసేవారు ముందుకొస్తారు. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీనం: కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.