Horoscope Today: ప్రయాణాల్లో ఆ రాశి వారికి జాగ్రత్త అవసరం.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Aug 27, 2024 | 5:01 AM

దినఫలాలు (ఆగస్టు 27, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. వృషభ రాశి వారికి బంధుమిత్రుల నుంచి ఆర్థిక సహాయానికి ఒత్తిడి పెరుగుతుంది. మిథున రావి వారికి అనుకోకుండా వాహన యోగం పడుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ప్రయాణాల్లో ఆ రాశి వారికి జాగ్రత్త అవసరం.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 27th August 2024
Follow us on

దినఫలాలు (ఆగస్టు 27, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. వృషభ రాశి వారికి బంధుమిత్రుల నుంచి ఆర్థిక సహాయానికి ఒత్తిడి పెరుగుతుంది. మిథున రావి వారికి అనుకోకుండా వాహన యోగం పడుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులన్నీ సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో వ్యయప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రుల నుంచి ఆర్థిక సహాయానికి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార విషయాల్లో కొత్త ఆలోచనలు చేపడతారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. కుటుంబసమేతంగా దైవ దర్శనాలు చేసు కుంటారు. ఉద్యోగంలో చిన్నా చితకా సమస్యలను పరిష్కరించుకుంటారు. తల్లితండ్రుల జోక్యంతో ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

కొందరు దగ్గర బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. అనుకోకుండా వాహన యోగం పడుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన పనులన్నిటినీ విజయ వంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుం టారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పట్టే అవకాశం ఉంది. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. అదనపు ఆదాయం కోసం ఎక్కువగా కష్టపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగు తాయి. కొందరు బంధుమిత్రులతో వివాదాలు, విభేదాలు సమసిపోతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కుటుంబంలో కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడతారు. కుటుంబంతో కలిసి ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఒడిదుడుకులతో ముందుకు సాగుతుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ప్రయాణాలు కూడా ఆశించినంతగా లాభదాయకంగా ఉండకపోవచ్చు. ఇంటా బయటా అనుకూలతలు ఉన్నా పని ఒత్తిడితో ఇబ్బంది పడతారు. గతంలో సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. ప్రయాణాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఏ పని చేపట్టినా శ్రమ, తిప్పట అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కానీ, ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ఆదాయానికి లోటుండదు కానీ, వృథా ఖర్చులు బాగా పెరుగుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొందరు బంధువుల సహాయంతో ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో గతం కంటే మెరుగైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతల మార్పు జరుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్య మైన వ్యవహారాలను చక్కబెడతారు. అనుకోకుండా పరిచయస్థుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆస్తి వివాదాల పరిష్కారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో బంధువులకు సంబంధించిన శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో అంచనాలను మించి లాభాలు పెరుగు తాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబం మీద ఖర్చులు బాగా పెరిగి ఇబ్బంది పడతారు. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక వ్యవహారాలన్నీ సానుకూలంగా సాగిపోతాయి. ఆస్తి వ్యవహారాలు కూడా చక్కబడతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా గడిచిపో తుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. దైవ కార్యాల్లో విశేషంగా పాల్గొం టారు. వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో నష్టాల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు కొత్త అవకాశాలు, ఆఫర్లు అందే అవకాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

చేపట్టిన పనులు, వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఆస్తి వివాదాలు రాజీ మార్గంలో పరిష్కారమయ్యే సూచనలు న్నాయి. ఆర్థిక లావాదేవీల జోలికి వెళ్లకపోవడం మంచిది. మీ విషయాల్లో కొందరు బంధువులు కల్పించుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు, శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉండ వచ్చు. ఉద్యోగపరంగా ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశముంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువులు, ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. వాహన యోగం పట్టే అవకాశం ఉంది. సన్నిహితుల నుంచి శుభ కార్య ఆహ్వానాలు అందుతాయి. ఆక స్మిక ధన లాభ సూచనలున్నాయి. చేపట్టిన పనులు, వ్యవహారాలు వేగంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. రుణ సమస్యల నుంచి చాలావరకు బయట పడతారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చు బాగా పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, వ్యాపారాల్లో కొద్ది పాటి సమస్యలున్నా అధిగమిస్తారు. కొన్ని కష్టనష్టాల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో హోదా పెరిగే సూచనలున్నాయి. ఆదాయం వృద్ధి చెందడమే తప్ప తగ్గే అవకాశం ఉండదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అద నపు ఆదాయ ప్రయత్నాలను ఉధృతం చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. అనవసర ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది.