Rasi Phalalu Today: కొన్ని సందర్భాల్లో మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే కొన్ని నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యక్రమంలోనూ ఆచితూచి, సమయానుకూలంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఆదివారం ముఖ్యంగా పలు రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా లేవు. మరికొన్ని రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అయితే.. ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో ఓ సారి పరిశీలిద్దాం.
మేష రాశి: ఈ రాశి వారి వారికి వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలున్నాయి. బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల. చిన్న విషయాలకోసం ఎక్కువగా శ్రమించే అవకాశం ఉంది.
వృషభ రాశి: ఈ రోజు ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకుంటే.. కార్యక్రమాలు ఆలస్యంగా సఫలమయ్యే అవకాశం ఉంది. చెడు పనులకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.
మిథున రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం, ప్రశాంతత నెలకొంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశముంది. సమయస్పూర్తిగా వ్యవహరిస్తే మంచిది.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా.. పూర్తిచేసే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకుంటే.. కార్యాలన్నింటిలో విజయం సాధించే అవకాశముంది. ఆకస్మిక ధనలాభంతో శుభవార్తలు వింటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
సింహ రాశి: ఈ రాశివారి శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆత్మీయుల సహాయ, సహకారాలు, ప్రశంసలు లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. ఓ శుభవార్త వింటారు.
కన్య రాశి: ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
తులా రాశి: కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది. మొదలు పెట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురైనా.. అధిగమించే ప్రయత్నం చేస్తారు.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధలు వెంటాడుతాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు శుభకార్య ప్రయత్నాలను సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభం ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తాయి.
మకర రాశి: ఈ రాశి వారికి కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధననష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన
వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కుంభ రాశి: ప్రారంభించే పనుల్లో బంధువుల సహకారం లభిస్తుంది. అపకీర్తిపాలు కాకుండా జాగ్రత్త పడటం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. కలహాలకు దూరంగా ఉండాలి.
మీన రాశి: ఈ రాశి వారు విందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో, కార్యక్రమాల్లో మార్పును కోరుకుంటారు. ఆటంకాలు ఎదురైనా కార్యక్రమాలు విజయవంతమవుతాయి.
Also Read: