Horoscope Today: ఆర్థిక సమస్యల నుంచి వారికి ఊరట.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Nov 23, 2024 | 5:01 AM

దిన ఫలాలు (నవంబర్ 23, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందే సూచనలున్నాయి. వృషభ రాశి వారికి ఉద్యోగపరంగా కొద్దిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు దాదాపు సమానంగా ఉంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆర్థిక సమస్యల నుంచి వారికి ఊరట.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
Horoscope Today 23 November 2024
Follow us on

దిన ఫలాలు (నవంబర్ 23, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందే సూచనలున్నాయి. వృషభ రాశి వారికి ఉద్యోగపరంగా కొద్దిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు దాదాపు సమానంగా ఉంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉద్యోగం పోయినవారికి, నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టం కలిగే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండకపో వచ్చు. కుటుంబం మీదా, శుభ కార్యాల మీదా ఎక్కువగా ఖర్చుపెట్టే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఒకటి రెండు కుటుంబ సమస్యలు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా కొద్దిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. అప్రయత్నంగా, అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజ యం సాధించడం జరుగుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఇతరుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమలో పడే అవకాశం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయ వ్యయాలు దాదాపు సమానంగా ఉంటాయి. శుభకార్యాలకు, దైవ కార్యాలకు సహాయం చేసే అవకాశం ఉంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. తొందరపాటు మాటల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, పని ఒత్తిడి బాగా తగ్గుతాయి. వ్యాపారాల్లో లాభాలు బాగానే వృద్ధి చెందుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పు‌ష్యమి, ఆశ్లేష)

ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగు తుంది. ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా దూసుకుపో తాయి. ప్రముఖులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. లాభదాయక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇంటా బయటా మంచి గుర్తింపు లభిస్తుంది. కొద్దిగా పని ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనా రోగ్యానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగం మారే అవకాశం లేదు. తండ్రి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. గృహ ప్రయత్నాల్లో కొద్దిపాటి పురోగతి ఉంటుంది. వాహన యోగం పట్టే అవకాశం ఉంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయపడతారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అందుతాయి. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా సజావుగా సాగిపోతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయ ప్రయత్నాలు కూడా సత్ఫలితాలనిస్తాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. పదోన్నతి లభించే అవకాశం కూడా ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా అప్రమ త్తంగా ఉండడం మంచిది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆరోగ్యం నిలకడగా సాగు తుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఉద్యోగంలోనే కాకుండా సర్వత్రా మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులకు మీ సమ ర్థత మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులతో లబ్ధి పొందుతారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందు తుంది. ఆదాయ వృద్ధికి సంబంధించిన ఏ ప్రయత్నమైనా సత్ఫలితాలనిస్తుంది. తీర్థ యాత్రలు, విహార యాత్రలకు ప్లాన్ వేస్తారు. రావలసిన డబ్బును, బాకీలను పట్టుదలగా రాబట్టుకుంటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వ్యక్తిగతం గాను, కుటుంబపరంగాను సుఖ సంతోషాలకు లోటుండదు. ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయత్నాలు సానుకూలపడతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆదాయ ప్రయత్నాల్లో మదుపు చేయడం జరుగుతుంది. బంధుమిత్రులతో ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు విజయ వంతం అవుతాయి. ఉద్యోగంలో పనిభారం తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకుంటారు. జీవిత భాగ స్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో మీ సమర్థతకు, ప్రతి భకు ఆశిం చిన గుర్తింపు లభిస్తుంది. అధికార యోగానికి కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కార్య కలాపాలు విస్తరిస్తాయి. ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందే లభించే అవకాశం ఉంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం మంచిది. వృథా ఖర్చులను దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. కుటుంబ పరిస్థితులు చాలావరకు చక్కబడతాయి. వాహన యోగం కలిగే అవకాశం ఉంది. మాతృమూలక ధన లాభం ఉంటుంది. గృహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందే అవకాశం ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవడానికి అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి శుభవార్తలు అందు తాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ఉపయోగాలు కలుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. రావలసిన డబ్బును పట్టుదలగా వసూలు చేసుకుంటారు. ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలు ఆర్జిస్తాయి.