దిన ఫలాలు (నవంబర్ 23, 2023): మేష రాశి వారు నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అంతా మీరనుకున్నట్టే జరిగిపోతుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో మీరు ఆశించిన విధంగా ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయాలు, సంపాదనలు పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అంతా మీరనుకున్నట్టే జరిగిపోతుంది. పిల్లల భవిష్యత్తు మీద దృష్టి కేంద్రీకరిస్తారు. సతీమణికి వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన శుభవార్తలు అందుతాయి. మీకు కూడా వృత్తి, ఉద్యోగాలు సజావుగా, సామరస్యంగా సాగిపోతాయి. సర్వత్రా ప్రాధాన్యం పెరుగుతుంది. చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూడకపోవడం మంచిది. ఆర్థిక సమస్యలకు అవకాశం లేదు. ఇతర మార్గాల ద్వారా ఆదాయం కాస్తో కూస్తో పెరిగే అవకాశం ఉంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో మీరు ఆశించిన విధంగా ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అధికారులు అన్ని విధాలుగానూ బాగా ప్రోత్సహించే అవకాశం ఉంది. ఆదాయానికి సంబంధించి ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కూడా లభిస్తుంది. చక్కని పరిచయాలు ఏర్పడ తాయి. బంధుమిత్రులతో బంధాల బలపడతాయి. వ్యాపారాల్లో లాభాలకు ఏమాత్రం లోటుండదు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
మీకు గురువు లాభ స్థానంలో బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొంత కాలం పాటు అన్ని విషయాలలోనూ నిశ్చింతగా ఉండవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయాలు, సంపాదనలు పెరుగుతాయి. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ సమయం అనుకూలంగా ఉంది. అనారోగ్యాల నుంచి చాలావరకు బయటపడతారు. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. దాంపత్య జీవితం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. సతీమణికి శుభవార్తలు అందు తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
అష్టమ శని బాధ కొంత తప్పకపోవచ్చు. ఏ పనీ ఒక పట్టాన పూర్తి కాక ఇబ్బంది పడతారు. ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ ఆలస్యం అవుతుంటుంది. కొంత నిరాశా నిస్పృహలకు గురవుతుంటారు. అయితే, మీకు ముఖ్యమైన గ్రహాలైన కుజ, రవులు ప్రస్తుతం అనుకూలంగా ఉన్నందువల్ల ఏ విష యంలోనూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని పనులూ సవ్యంగానే చివరికి పూర్తవు తాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటే వేద వాక్కు అవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లోనే కాదు, సర్వత్రా మీకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఒక్కొక్క సమస్యా సానుకూ లంగా పరిష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అటు అధికారులు, ఇటు సహోద్యోగులు మిమ్మల్ని, మీ పనితీరును బాగా అభిమానిస్తారు. వ్యక్తిగత జీవితంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సరైన పరిచయాలు కలుగుతాయి. తల్లితండ్రుల ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్తంత జాగ్రత్త తీసుకోవడం మంచిది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే సూచనలు కూడా ఉన్నాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ముఖ్యమైన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యవహార శైలిలో మార్పు అవసరం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎవరి తోనూ మీ బలాలు, బలహీనతల గురించి చెప్పవద్దు. సహోద్యోగులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండదు కానీ, యథేచ్ఛగా ఖర్చు చేయడం వల్ల కొద్దిగా కష్టనష్టాలకు గురి కావాల్సి ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
మీకు రోజంతా సాఫీగా గడిచిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు కానీ, ఖర్చులు మాత్రం బాగా పెరుగుతాయి. ఎడాపెడా ఖర్చు చేయడం వల్ల ఆర్థికంగా ఒత్తిడికి గురవు తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు బాగానే సాగిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలతో సహా ఏ ప్రయత్నమైనా ఆశించిన ఫలితాలనిస్తుంది. సతీమణికి ఆర్థిక యోగం పడుతుంది. మీలో కొద్దిగా భక్తి భావాలు పెరిగి, ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఏం చేసినా చెల్లిపోతుంది. అర్ధాష్టమి ఉన్నా, గురువు అనుకూలంగా లేకపోయినా లెక్క చేయా ల్సిన అవసరం ఉండదు. రోజంతా మీరనుకున్నట్టే, మీకు అనుకూలంగానే గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీరే అధికారం చెలాయించే అవకాశం ఉంటుంది. మాట తొందరపాటును, కోప తాపా లను తగ్గించుకోవడం చాలా అవసరం. ఇతరత్రా మీకు ఏ విధంగా చూసినా బాగానే ఉంటుంది. మీ మాటకు విలువనిస్తారు. మీ నుంచి సలహాలు తీసుకుంటారు. ఆదాయానికి లోటుండదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
రోజంతా మీకు అనుకూలంగానే సాగిపోతుంది. మీ ప్రయత్నాలన్నీ సానుకూలపడతాయి. ముఖ్యంగా ఆస్తి వివాదం ఒకటి మీకు అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటే చెల్లుబాటవుతుంది. ఆదాయపరంగా ఎటువంటి ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతుంది. రాజకీయ ప్రముఖులతో కలివిడిగా తిరుగుతారు. సతీమణికి వృత్తి, ఉద్యోగాలపరంగా ప్రాధాన్యం పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష‌్ట 1,2)
వృత్తి, ఉద్యోగాల్లోనూ, ఆర్థిక వ్యవహారాల్లోనూ సమస్యలేవీ ఉండకపోవచ్చు. కొన్ని ముఖ్యమైన సమస్యలు, వ్యవహారాలు చాలావరకు సానుకూలపడతాయి. ఏలిన్నాటి శని కారణంగా కొద్దిగా మానసిక ఆందోళన ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగానే ఉంటాయి. సతీమణి నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. ఆదాయం పెరుగుదలనూ, పురోగతిని సూచించే లాభస్థానం అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా హాయిగానే గడిచి పోతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఏదో ఒక దానికి ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఒక సమస్య పరిష్కారమయితే మరో సమస్య ప్రారంభమవుతుంది. ఏలిన్నాటి శని కారణంగా కొన్ని ఆలస్యాలు, స్వల్ప అనారోగ్యాలు మధ్య మధ్య తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాలకు మాత్రం ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఉద్యోగ స్థానంలో రవి, బుధ, కుజులు ఉన్నందువల్ల మీ మాటకు తిరుగుండదు. ప్రాధాన్యం పెరుగుతుంది. సతీ మణికి వృత్తి, ఉద్యోగాల్లో జీత భత్యాలు పెరిగే అవకాశం ఉంది. మీకు ఆధ్యాత్మిక చింతన పెరుగు తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
మీ మనసులోని కోరికలు నెరవేరడం ఈ రోజు విశేషం. ఏలిన్నాటి శని నడుస్తున్నప్పటికీ, రాశ్య ధిపతి గురువు ధన స్థానంలో బలంగా ఉన్నందువల్ల, ప్రస్తుతానికి భాగ్య స్థానం కూడా అను కూలంగా ఉన్నందువల్ల మీరు ఎట్లా అనుకుంటే అట్లా జరుగుతుంది. ఎలాంటి ప్రయత్నం తల పెట్టినా సఫలం అవుతుంది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ఆరోగ్యా నికి, ఆదాయానికి కొరవ ఉండదు కానీ, కొద్దిగా డబ్బు నష్టం జరిగే అవకాశం మాత్రం కనిపిస్తోంది.