Horoscope Today: ఈ రాశివారు చేపట్టే పనులు సకాలంలో పూర్తి చేస్తారు.. వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం

|

Jul 23, 2021 | 6:38 AM

Horoscope Today: మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో కొన్ని జీవితాలు చిన్నాభిన్నం అవుతుంటాయి. కొన్ని కొన్ని నిర్నయాలు తీసుకునే సమయంలో..

Horoscope Today: ఈ రాశివారు చేపట్టే పనులు సకాలంలో పూర్తి చేస్తారు.. వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం
Rasi Phalalu
Follow us on

Horoscope Today: మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో కొన్ని జీవితాలు చిన్నాభిన్నం అవుతుంటాయి. కొన్ని కొన్ని నిర్నయాలు తీసుకునే సమయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన ఉంటుంది. శుక్రవారం ముఖ్యంగా పలు రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా లేవు. మరికొన్ని రాశుల వారికి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో చూద్దాం.

మేషరాశి:

ఈ రాశివారు ఈ రోజు చేపట్టే పనుల్లో అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ఓ వ్యవహారంలో వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చంద్రధ్యానం చేయడం మేలు జరుగుతుంది.

వృషభరాశి:

ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసికంగా ప్రశాంతత కలిగిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాలి. దుర్గాదేవిని దర్శించుకోవడం మంచిది.

మిథున రాశి:

ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. కుటుంబంలో మంచి పేరు సంపాదించుకుంటారు. ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది.

కర్కాటకరాశి:

ఈ రాశివారికి ఈ రోజు మెరుగైన ఫలితాలు ఉంటాయి. గతం నుంచే పూర్తి చేయాలనుకున్న పనిని ఈ రోజు పూర్తి చేస్తారు. మహాలక్ష్మీ అమ్మవారిని పూజించడం మేలు జరుగుతుంది.

సింహరాశి:

ఈ రాశివారికి ఈ రోజు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యాపారాలలో ముందుకు సాగుతారు. మంచి లాభాలు అందుకుంటారు. ఇతరు సలహాసహాకారాలు ఉంటాయి. శివున్ని రాధించడం మంచిది.

కన్యరాశి:

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలున్నాయి. తోటివారితో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాలి. సుబ్రహ్మణ్యస్వామి దర్శనం మేలు జరుగుతుంది.

తులరాశి:

నిరుద్యోగులు, ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యుల సాయం అందుకుంటారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గణపతి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

వృశ్చికరాశి:

ఈ రాశివారికి వ్యాపారాల్లో మోసాలు జరిగే అవకాశాలున్నాయి. జాగ్రత్తగా ఉండటం మంచిది. ధైర్యంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇష్టదైవాన్ని ప్రార్థించడం మేలు జరుగుతుంది.

ధనుస్సురాశి:

చేసే పనులలో కుటుంబ సహకారం ఉంటుంది. శతృవులపై విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సాయం అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దుర్గదేవిని పూజించడం మేలు జరుగుతుంది.

మకరరాశి:

మీకు అప్పగించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహాకారాలు అందుకుంటారు. వ్యాపారాలలో ముందుకు సాగుతారు. ఇష్టదైవాన్ని తలుచుకోవడం మంచిది.

కుంభరాశి:

చేపట్టిన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళిక గురించి ఆలోచిస్తుంటారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆంజనేయస్వామిని దర్శించుకోవడం మేలు జరుగుతుంది.

మీనరాశి:

మంచి పనులు చేపట్టేందుకు ఈ రోజు సరైన సమయం. బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఇంట్లో ఓ శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శుభకార్యాలయాల్లో పాల్గొంటారు. లక్ష్మీ్స్తోత్రం పటించడం మంచి జరుగుతుంది.

ఇవీ కూడా చదవండి:

Tirumala : దేవదేవుడు తిరుమల శ్రీ‌వారి భ‌క్తుల‌కు శుభవార్త చెప్పిన టిటిడి ఈవో

Brahmamgari Matam: బ్రహ్మంగారి ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్.. మారుతి మహాలక్ష్మి మఠంలోకి రానివ్వదంటున్న గ్రామస్థులు