Horoscope Today (21-01-2022): చాలామంది రోజు మొదలు పెట్టె ముందు లేదా పనులు ప్రారంభించే ముందు మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జనవరి 21వ తేదీ ) శుక్రవారం (Friday) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేష రాశి: ఈరోజు ఈ రాశివారు వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగంలోని వారు శుభ ఫలితాలను అందుకుంటారు. ఈ రాశివారు తమ తెలివి తేటలతో కీలక సమస్యలను పరిష్కరించుకుంటారు.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారికి శారీరక శ్రమ అధికమవుతుంది. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకుని ముందుకు సాగాలి.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు పెద్దల సాయంతో ముఖ్యమైన విషయంలో ముందుకుసాగుతారు. చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలను అందుకుని అందరి ప్రశంసలను అందుకుంటారు.
కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు శారీరక శ్రమ అధికంగా చేయాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలతో ఇబ్బందులకు గురవుతారు. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు చక్కటి ఆలోచనగా విధానంతో ముందుకు సాగి మంచి పేరు సంపాదించుకుంటారు. విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రారంభించిన పనిలో ముందుచూపుతో వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు శ్రమ అధికంగా ఉంటుంది. అధిక వ్యయం చేస్తారు. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. అవసరానికి తగిన సాయం అందుకుంటారు. శుభవార్త ను వింటారు.
వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు ఈ రోజు సంతోషంగా కాలం గడుపుతారు. చేపట్టిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అన్ని రంగాల్లోని వారికి శుభ ఫలితాలు లభిస్తాయి. అనవసర విషయాలకు దూరంగా ఉండడం మంచిది.
మకర రాశి: ఈరోజు ఈ రాశివావారు కుటుంబ సభ్యుల సహకారంతో పనులు పూర్తి అయ్యేలా చూసుకోవాల్సి ఉంటుంది. మన స్తాపాన్ని కలిగించే పనులు వాయిదవేసుకోవడం ఉత్తమం. మీకు ఆనందం ఇచ్చే శుభవార్తను వింటారు.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీ ఇంట్లో సంతోషాన్ని నింపే శుభవార్తను వింటారు కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యమైన పనిలో ఆర్థికసాయం అందుకుంటారు.
మీన రాశి: ఈరోజు ఈరాశి వారు ఆర్ధికంగా లాభాలను అందుకుంటారు. ఆయా రంగాల్లోని వారు సక్సెస్ అందుకుంటారు. సంతోషాన్ని పొందుతారు.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
Also Read: