Horoscope Today March 19th 2021: ప్రస్తుత కాలంలో రాశిఫలాలను విశ్వసించేవాళ్లు అనేకం. ఉదయాన్నే తమ భవిష్యత్ రోజులో జరిగే విషయాలను ముందుగానే తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈరోజు మార్చి 19 శుక్రవారం నాడు చంద్రుడు వృషభంలో సంచరించనున్నాడు. ఈరోజు మేషరాశి నుంచి మీన రాశి వరకు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఈరోజు వీరికి చిత్ర విచిత్ర సంఘటనలు ఎదుర్కోంటారు. ఈరోజు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటుంటారు. పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు వీరికి శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.
ఈరోజు వీరు ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని కష్టమైన పనులు చేస్తుంటారు. ఈరోజు వీరికి కాలభైరవ అష్టోత్తర స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగాల విషయంలో అన్వేషణ తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ఈరోజు వీరికి నవగ్రహ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి వ్యవహారిక విషయాల్లో అనుకూలత ఉంటుంది. సాంఘిక, జన సంక్షేమ కార్యాక్రమాల్లో పాల్గొంటుంటారు. ఈరోజు వీరికి శివారాధన మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి రావాల్సిన బాకీలు కొంత ఆలస్యమవుతుంటాయి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. విష్ణు సహస్త్ర నామా స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి వ్యక్తిగతంగా కొన్ని కార్యక్రమాలు ఇబ్బంది పెడుతుంటాయి. వ్యయప్రయాసాలకు తట్టుకోవాల్సి వస్తుంది. ఈరోజు వీరికి సుబ్రమణ్య స్వామి దర్శనం, పేదవారికి ధానం వంటివి మేలు చేస్తాయి.
ఈరోజు వీరికి నూతన పరిచయాలు ఏర్పడుతుంటాయి. వీరు శుభవార్తలు వింటారు. వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మహాలక్ష్మీ అమ్మవారి కుంకుమార్చన మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి. అలాగే సంఘంలో ఘర్షణపూరిత వాతావరణం చోటు చేసుకుంటుంది. ఈరోజు వీరు మహా గణపతికి లడ్డూలు నివేదన చేసుకోవడం మంచిది.
ఈరోజు వీరికి రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి. ఇతర మార్గాలను అన్వేషిస్తారు. ఈరోజు వీరికి శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తోంది.
ఈరోజు వీరికి ఇష్టంలేకున్న కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ధార్మికంగా కొన్ని పూజా కార్యాక్రమాల్లో పాల్గొంటుంటారు. ఈరోజు వీరికి నవగ్రహ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
ఈరోజు దూరప్రాంతాల నుంచి కొన్ని ఆహ్వానాలు అందుతాయి. వాహన సౌఖ్యాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు వీరికి దుర్గా సప్తశ్లోకి పారాయణం మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి సన్నిహితుల నుంచి ఆశించిన సహాకారం అందుకుంటారు. చేపట్టిన పనులలో అనుకూలమైన ప్రయోజనాలు సాధించుకోగలుగుతారు. శ్రీవెంకటేశ్వర స్వామి శంఖ పూష్పాలతో అర్చన చేయాలి..
Also Read: