దిన ఫలాలు (ఫిబ్రవరి 19, 2024): మేష రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృషభ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. మిథున రాశి వారికి ఆర్థిక ప్రయత్నాలు కలసి వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సామరస్య వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కొన్ని పనులను సమర్థవంతంగా, సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. రాదనుకున్న డబ్బు కూడా చేతికి వస్తుంది. కీలక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం, సమయస్ఫూర్తితో వ్యవహరించడం జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో అదనపు బాధ్యతల ఒత్తిడి తగ్గుతుంది. నిరుద్యోగులకు కలిసి వచ్చే సమయం ఉంది. సరైన ప్రయత్నాలు చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. వివాహ ప్రయత్నాలు కూడా సఫలం అయ్యే అవకాశం ఉంది. మొండి బాకీలు వసూలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాలు, సేవా కార్యక్రమాల్లో పాలొంటారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగ పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో ఒకరికి స్వల్పంగా అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. కీలక వ్యవహారాల్లో ఆలోచించి అడుగువేయాలి. ఆర్థిక ప్రయత్నాలు కలసి వస్తాయి. ప్రారంభించిన పనుల్లో కొద్దిగా ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో తొందరపాటుతో మాట్లాడడం మంచిది కాదు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో అదనపు పనిభారం ఉంటుంది. సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి ఆలయ దర్శనం చేసుకుంటారు. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగ జీవితంలో శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొన్ని వ్యవహారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. బంధువులతో సమస్యలు ఉత్ప న్నమవుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు. ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీల జోలికి పోకపోవడం శ్రేయస్కరం. ప్రయాణాలు కలిసి వస్తాయి కానీ, జాగ్రత్తగా ఉండడం మంచిది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగు తాయి. బంధుమిత్రులతో స్నేహ సంబంధాలు మరింత పెరుగుతాయి. సమాజంలో మాట చెల్లు బాటు అవుతుంది. ఆర్థిక పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్తువుల కొనుగోలుకు అవకాశం ఉంది. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త నిర్ణ యాలు, కొత్త ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలావరకు చక్కబడు తుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి సాధిస్తారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ పెద్దల సహాయంతో కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుతారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి లోటుండదు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో అధికారులతో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. పితృవర్గం వారితో ఆస్తి వివాదాలు కొద్దిగా చికాకు కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో శ్రమ పెరుగుతుంది, ఫలితం తగ్గుతుంది. చేపట్టిన పనులలో విఘ్నాలు, ఆటంకాలు తొలగిపో తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగు తాయి. కొన్ని ముఖ్యమైన పనుల్ని సానుకూలంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సన్నిహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో అదికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాలు నత్తనడక నడుస్తాయి. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవు తుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా కొనసాగుతుంది. మీ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నవారు ముఖం చాటేస్తారు. అవసరానికి డబ్బు లభించక ఇబ్బందిపడే సూచనలున్నాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల ద్వారా అనుకోకుండా ధన లాభం పొందుతారు. తలపెట్టిన పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ తాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. వ్యాపారాలకు కొత్త పెట్టుబ డులు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మొండి బాకీలు వసూలవు తాయి.