దిన ఫలాలు (జూన్ 18, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి కరువవుతుంది. వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన గుర్తింపు లభించడంతో పాటు రాబడి బాగా పెరుగుతుంది. మిథున రాశి వారు కుటుంబ వ్యవహారాల్లో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గే అవకాశం ఉంది. బాగా ఉత్సాహం కలిగిస్తాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి కరువవుతుంది. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉన్నా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల నష్టం తప్ప లాభం ఉండే అవకాశం లేదు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. కొన్ని ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన గుర్తింపు లభించడంతో పాటు రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో సమస్యలు, వివాదాలు సర్దుమణుగుతాయి. వాహన యోగానికి అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడ తాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. అనుకోకుండా కొన్ని శుభవార్తలు వింటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఇంట్లో శుభ కార్యాల ఆలోచనలు చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. సన్నిహితుల నుంచి వస్తు లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మంచి మార్పులు చేసి లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం బాగా అనుకూలంగా, సామరస్యంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు వేగం పుంజుకొంటాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
సోదరులతో ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుం టాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపా రాలు పరవాలేదనిపిస్తాయి. పిల్లల చదువుల్లో శ్రద్ధ తీసుకోవడం మంచిది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేయగలుగుతారు. అవసరాలకు తగ్గట్టు డబ్బు అందుతుంది. కొద్దిపాటి అనారో గ్యానికి అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఏ ప్రయత్నం చేపట్టినా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. కొందరు దగ్గర బంధువులతో మాట పట్టిం పులు తలెత్తే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమా ధిక్యత ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొద్దిగా నిరుత్సాహకర వాతావరణం ఉంటుంది. అనవసర పరిచ యాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
నిరుద్యోగులకు సరికొత్త అవకాశాలు లభిస్తాయి. కొన్ని వ్యవహారాల్లో వ్యయప్రయాసలున్నప్పటికీ, నిదానంగా వాటిని పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో చాలావరకు నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగులు జీతభత్యాలు, పదోన్నతుల విషయంలో శుభవార్తలు వింటారు. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. అనుకున్న సమయానికి పనులు పూర్తి అయ్యే అవకాశం ఉండదు. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాలు తమకు అంది వచ్చిన అవకాశాలను చేజారిపోకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో అధికారులతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వ్యక్తి గత సమస్యల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం పరవాలేదనిపి స్తుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. దైవ కార్యాలు నిర్వహిస్తారు. ఆస్తి వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలుంటాయి. ఉద్యోగుల శ్రమకు, ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కొత్తగా వాహన యోగం పడుతుంది. అనుకోకుండా, అప్రయత్నంగా వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. రాజ కీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఇంటా బయటా ఊహించని సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన పనుల్లో కొద్దిగా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆస్తి వివాదాల్లో చిక్కుముడి పడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సా హంగా సాగిపోతుంది. ప్రయాణాల వల్ల కొద్దిగానే ప్రయోజనం ఉంటుంది. ధనపరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. మంచి పరిచయాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా బాగా పుంజుకుంటాయి. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. ఆస్తి వివాదంలో రాజీమార్గం అనుసరించి పరిష్కరించుకుంటారు. ఉద్యోగులు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. అనుకోని ఖర్చుల్ని భరించాల్సి వస్తుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
అనుకున్న పనుల్ని అనుకున్న విధంగా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులతో విహార యాత్ర చేసే అవకాశం ఉంది. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో చాలా కాలంగా వేధి స్తున్న కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగు తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
కుటుంబ సభ్యుల కారణంగా కొద్దిగా ఇబ్బందులు పడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంత రాలు తొలగుతాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. వ్యాపా రాలు నత్తనడక నడుస్తాయి. ఉద్యోగజీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. నిరుద్యోగుల ప్రయ త్నాలు విజయవంతం అవుతాయి. ఆస్తి వివాదంలో సోదరులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు.