Horoscope Today: ఈరోజు ఈరాశివారికి ఉద్యోగాల విషయంలో సానుకూల ప్రభావాలున్నాయి.. ఈరోజు రాశిఫలాలు..

Horoscope Today March 17th 2021: ప్రస్తుత కాలంలో రాశిఫలాలను విశ్వసించేవాళ్లు అనేకం. ఉదయాన్నే తమ భవిష్యత్ రోజులో జరిగే విషయాలను

Horoscope Today: ఈరోజు ఈరాశివారికి ఉద్యోగాల విషయంలో సానుకూల ప్రభావాలున్నాయి.. ఈరోజు రాశిఫలాలు..
Horoscope Today 17th March
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 17, 2021 | 7:31 AM

Horoscope Today March 17th 2021: ప్రస్తుత కాలంలో రాశిఫలాలను విశ్వసించేవాళ్లు అనేకం. ఉదయాన్నే తమ భవిష్యత్ రోజులో జరిగే విషయాలను ముందుగానే తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈరోజు మార్చి 17 బుధవారం నాడు చంద్రుడు అంగారకుడ రాశి అయిన మేషంలో ఉండనున్నాడు. ఈరోజు మేషరాశి నుంచి మీన రాశి వరకు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషరాశి..

ఈరోజు వీరు వ్యక్తిగత అవసరాల కోసం కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటుంటారు. వ్యాపార వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాల్సి వస్తుంది. ఈరోజు వీరికి ఆంజనేయ స్వామి దర్శనం మేలు చేస్తుంది.

వృషభరాశి..

ఈరోజు వీరు కొన్ని అనుహ్యమైన ఫలితాలను సాధించుకుంటారు. వస్తు, వస్త్రా లాభాలు సంతోషాన్ని కలుగజేస్తాయి. ఈరోజు వీరు పేదవారికి పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం మంచిది.

మిథున రాశి..

ఈరోజు వీరికి నెమ్మదిగా ఇబ్బందికర పరిస్థితులు తొలగిపోయే అవకాశాలున్నాయి. అదేవిధంగా పలు రకాల కార్యాక్రమాలను ఏర్పాటు చేసుకోని విజయవంతంగా పూర్తి చేస్తుంటారు. ఈరోజు గౌరీశంకరుల అర్చన దర్శనం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి..

ఈరోజు వీరికి ఆస్తి విషయాల్లో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. తీవ్రంగా ఆలోచనలు చేస్తుంటారు. ఈరోజు వీరికి శ్రీసుక్తా పారాయణం మేలు చేస్తుంది.

సింహరాశి..

ఈరోజు వీరు వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో చేసిన కొన్ని చేసిన తప్పులను సరిచేసుకునే అవకాశాలు కలిసి వస్తుంటాయి. ఈరోజు గణపతి దర్శనంతోపాటు తల్లిదండ్రుల ఆశీస్సులు మేలు చేస్తాయి.

కన్యరాశి..

ఈరోజు వీరికి వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఉన్న ఇబ్బందులు నెమ్మదిగా తొలగిపోతాయి. ఉద్యోగాల విషయంలో కొన్ని అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. ఈరోజు నవగ్రహ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

తులా రాశి..

ఈరోజు వీరికి శ్రమ, ఫలితాలు సమానంగా ఉంటాయి. కానీ కొన్ని విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఏర్పడుతాయి. ఈరోజు వీరికి మహాలక్ష్మీ అర్చన మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి..

ఈరోజు వీరికి పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి వ్యక్తిగత విషయాలు చెప్పుకోవద్దు. ఈరోజు వీరికి ఆంజనేయ స్వామి దర్శనం మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి..

ఈరోజు వీరికి వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు బాధకు గురిచేస్తుంటాయి. కుటుంబసభ్యులతో ఘర్షణ మంచిది కాదు. ఈరోజు శ్రీవెంకటేశ్వర దర్శనం మేలు చేస్తుంది.

మకర రాశి..

ఈరోజు వీరికి కుటుంబంలో ఏర్పాటుచేసుకున్న కొన్ని వ్యక్తిగత కార్యాక్రమాలను పూర్తిచేసుకుంటారు. ఉద్యోగ సమస్యలు నెమ్మదిగా తీరిపోతుంటాయి. ఈరోజు దుర్గా దేవి ఆరాధన మేలు చేస్తుంది.

కుంభరాశి..

ఈరోజు వీరు సన్నిహితులతో సఖ్యతగా ఉంటారు. ఈరోజు చేపట్టిన పనులు ఉత్సహకంగా పూర్తిచేసుకుంటారు. విష్ణు సహస్త్ర నామ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

మీనరాశి..

ఈరోజు వీరు చేపట్టిన పనులు వ్యవహరిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణాలు, అప్పులు చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి. నవగ్రహ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.