Horoscope Today March 16th 2021: ప్రస్తుత కాలంలో రాశిఫలాలను విశ్వసించేవాళ్లు అనేకం. ఉదయాన్నే తమ భవిష్యత్ రోజులో జరిగే విషయాలను ముందుగానే తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈరోజు మార్చి 16 మంగళవారం నాడు చంద్రుడు.. మేషంలో ఉండనున్నాడు. ఈరోజు మేషరాశి నుంచి మీన రాశి వరకు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఈరోజు మీరు చేసే పనులలో ఏమాత్రం కూడా తొందరపడకూడదు. రావాల్సిన బాకీల వసూలు చేసుకోవడంలో కొంత జాగ్రత్తను వహిస్తూ ఉండాలి. ఈరోజు దుర్గా అమ్మవారి ఆరాధన కుంకుమార్చన నిర్వహించుకోవడం మంచిది.
ఈరోజు వీరికి శ్రమ పెరుగుతుంది. తగినటువంటి ప్రయోజనాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. వ్యాపార సంబంధమైన సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది. పేదవారికి బియ్యం ధానం చేయడం మంచిది.
ఈరోజు వీరికి కుటుంబపరమైన అంశాలలో జాగ్రత్తలు తీసుకుంటుండాలి. కొన్ని రకాల ఆందోళనలు ఉంటాయి. అనవసరమైన భయం, ఆందోళనలు చెందకూడదు. ఈరోజు వీరు శివాలయ దర్శనం చేసుకోవడం.. పేదవారికి కాయకూరలను ధానం చేసుకోవడం మంచిది.
ఈరోజు వీరికి ఆర్థిక పరిస్థితులను కొంత మెరుగుపరుచుకునే అవకాశాలు వస్తుంటాయి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కాలభైరవ అష్టక స్ట్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి సన్నిహితుల యొక్క సఖ్యత ఆనందాన్ని కలుగజేస్తుంది. వాహనాలు కొనుగోలు చేసుకునేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈరోజు నవగ్రహా స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి ఇంట, బయట కొన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గోనాల్సి వస్తుంది. తగినటువంటి సమాచారాల కోసం ఎదురు చూస్తుంటారు. ఈరోజు వీరు సుబ్రమణ్య స్వామి ఆరాధన కలిసి వస్తుంది.
ఈరోజు వీరు సన్నిహితులను కలుసుకుంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటుంటారు. రావాల్సిన బాకీల కోసం ప్రయాత్నాలు చేస్తుంటారు. ఈరోజు వీరికి అష్టలక్ష్మీ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
ఈరోజు వీరు చేపట్టినటువంటి పనులలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. అలాగే ప్రయోజనాల కోసం కష్టపడితేకానీ ఫలితాలను సాధించలేరు. ఈరోజు వీరికి శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తవుతుంటాయి. వ్యాపార విస్తరణ విశేషంగా శుభఫలితాలను కలుగజేస్తాయి. ఈరోజు వీరికి గోసేవా ఆనందాన్ని కలుగుజేస్తుంది.
ఈరోజు వీరికి కుటుంబంలో కొన్ని కార్యక్రమాల్లో ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఈరోజు చేపట్టినటువంటి పనులలో కొన్ని వాయిదా పడే అవకాశాలున్నాయి. ఈరోజు వీరికి శివాలయ దర్శనం, నందిశ్వర పూజా మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి ఎక్కువగా ప్రయాణాలు చేసే అవసరాలు ఏర్పడతాయి. వ్యక్తిగత పనులలో కొంత అశ్రద్ద ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు గణపతి దర్శనం మేలు చేస్తుంది.
ఈరోజు వీరు ఉద్యోగాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే అప్పుల బాధలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు గణపతి స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.