దిన ఫలాలు (ఆగస్టు 16, 2024): మేష రాశి వారికి ఈ రోజు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. మిథున రాశి వారు ఆశించిన శుభవార్తలు వింటారు. ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకున్నవి అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యల ఒత్తిడి చాలావరకు తగ్గిపోతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మిత్రుల సహా యంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
రాశ్యధిపతి శుక్రుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఏ వ్యవహారమైనా సాను కూలంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలు పని భారం ఎక్కువగా ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు కష్టనష్టాల నుంచి చాలావరకు బయటపడతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో బంధువుల జోక్యం మంచిది కాదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
కుటుంబంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగపరంగా సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆశించిన శుభవార్తలు వింటారు. ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు నష్టాల నుంచి చాలా వరకు బాటపడతాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఊహించని విధంగా ఒకటి రెండు వ్యక్తిగత సమ స్యలకు పరిష్కారం లభిస్తుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉద్యోగ సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో మీ శక్తి సామర్థ్యాలకు గుర్తింపు లభిస్తుంది. మీ వ్యవహార శైలితో అందరినీ ఆకట్టు కుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
రోజంతా ఉత్సాహంగా, హుషారుగా గడిచి పోతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. సోదరులు, కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు చాలావరకు పెరుగుతాయి. ఆదాయానికి లోటు లేకపోవడం వల్ల కొద్దిగా ఆర్థిక సమ స్యల నుంచి బయటపడతారు. ఉద్యోగ జీవితం బాగానే ఉంటుంది. వ్యక్తిగత సమస్య సమసిపోతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు లాభాలనిస్తాయి. ఆధ్యా త్మిక సేవా ఎక్కువగా పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంటా బయటా అనుకూలతలు ఎక్కువగానే ఉంటాయి. ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం శ్రేయ స్కరం. వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది. అనుకోకుండా ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తక్కువ, లాభం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగాల్లో కొన్ని సాఫల్యాలు, ఘనతలు నమోదవుతాయి. కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
అన్ని విషయాల్లోనూ శ్రమాధిక్యత ఉంటుంది. కష్టే ఫలీ అన్నట్టుగా రోజంతా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు చాలావరకు నిలకడగా ఉంటాయి. ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యయప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపడతారు. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
కొన్ని ముఖ్యమైన సమస్యలను అధిగమిస్తారు. ఆర్థిక వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సాధారణంగా ఈ రాశివారికి ఈ రోజంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. మంచి పరి చయాలు ఏర్పడతాయి. కొందరు చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. నిరుద్యో గులకు మంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగా సానుకూలంగా సాగిపో తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. లాభ దాయక పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాలు చాలావరకు హ్యాపీగా సాగిపోతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో ఒక మోస్తరు లాభాలుంటాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. కొందరు బంధువుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా బాగా పుంజుకునే అవకాశం ఉంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఏలిన్నాటి శని ప్రభావం వల్ల ఒత్తిడి, శ్రమ కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. ఉద్యోగపరంగానే కాక, కుటుంబపరంగా కూడా బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా నిలకడగా సాగిపోతాయి. సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడంమంచిది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రాశ్యధిపతి గురువు కాస్తంత అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా ఉత్సాహంగా, హుషారుగా గడిచిపోతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ చాలావరకు సత్ఫలితాలనిస్తాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యానికి, ఆదాయా నికి లోటు ఉండదు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు, వ్యవ హారా లను పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి.