దిన ఫలాలు (మే 15, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి కరువవుతుంది. వ్యాపారాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. మిథున రాశి వారికి ఆర్థికంగా బాగా అనుకూల వాతావరణం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఇతరుల వ్యవహారాల్లో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేసి లాభాలు అందుకుంటారు. అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు చాలావరకు అనుకూల ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగ స్వామిని సంప్రదించడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి కరువవుతుంది. వ్యాపారాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. సొంత ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. ఇంటా బయటా ఒత్తిడి, శ్రమ ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. రావలసిన డబ్బు చేతికి అంది ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుకుంటారు. ముఖ్య వ్యవహారాలు సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. చేపట్టిన ప్రతి పనీ సునాయాసంగా పూర్తవుతుంది. ఆర్థికంగా బాగా అనుకూల వాతావరణం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, కుటుంబ సమే తంగా ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. కుటుంబ వ్యవహా రాలకు సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పిల్లలు పరీక్షల్లో, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధి స్తారు. ఉద్యోగంలో కొన్ని కీలక వ్యవహారాలను సునాయాసంగా చక్కబెడతారు. వృత్తి జీవితంలో ఆశించిన ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభాలపరంగా నిలకడగా సాగుతాయి. దైవ కార్యాలు నిర్వహిస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
కుటుంబ సభ్యుల నుంచి, తల్లితండ్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ధన వ్యవహా రాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగంలో చిన్నా చితకా సమస్యలను తేలికగా అధిగమి స్తారు. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల సమస్యలు బాగా తగ్గుతాయి. వ్యక్తిగత పురోగతి విషయంలో ఆటంకాలను ఎదుర్కొని విజయాలు సాదిస్తారు. భూ సంబంధమైన క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా సోదరులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆస్తి వివా దాలు తలెత్తే అవకాశముంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం శ్రేయస్కరం. వ్యాపా రాల్లో ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరిగినా, పనులన్నీ నిదానంగా పూర్తవుతాయి. పెండింగు పనులు మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అనుకోకుండా దీర్ఘ ప్రయాణాలు వాయిదా పడతాయి. కొత్త కార్యక్రమాలు, ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. బంధుమిత్రుల నుంచి శుభ వార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి కానీ, అధికారులతో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. కొందరు దగ్గర బంధువులతో మాట పట్టింపులుంటాయి. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. వ్యాపారాల్లో క్రమంగా నష్టాల నుంచి బయటపడతారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడే అవకాశముంది. పిల్లల చదువుల విషయంలో ఆశించిన శుభ సమాచారం అందుతుంది. అన్ని రంగాల వారికి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఉద్యోగులు కొత్త పదవులు పొందుతారు. బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి జీవితంలో రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు వెడతాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
పిల్లల చదువులు, ఆరోగ్య విషయాల్లో శ్రద్ద పెంచుతారు. ఆర్థిక సమస్యలు చాలావరకు తొలగి పోతాయి. శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరగడం, కొత్త పదవులు లభించడం వంటివి జరుగుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు బాగా తగ్గి, ఊరట లభిస్తుంది. ధనపరమైన ఒడిదుడుకులన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా బాగా మెరుగ్గా ఉంటుంది. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
కుటుంబ పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. పిల్లల ఉద్యోగ, విద్యా ప్రయత్నాలు చాలావరకు విజయవంతం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. పెట్టుబడులకు తగ్గ రాబడి కూడా ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు, తోటి ఉద్యోగులను మీ పనితీరుతో ఆకట్టు కుంటారు. కొందరు మిత్రులతో కొద్దిపాటి విభేదాలు కలుగుతాయి. ప్రయాణాల్లో వాహన ఇబ్బందు లుంటాయి. నిరుద్యోగులకు సొంత ప్రాంతంలోనే కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. మిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం లభిస్తుంది. పిల్లలు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. మానసికంగా ఉత్సాహవంత మైన వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలతో ముందుకు వెడతారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతల భారం పడుతుంది. నిరుద్యోగులకు తప్పకుండా శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం, ఆదాయం బాగా అనుకూలంగా ఉంటాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రావలసిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. విలాసాల మీద ధన వ్యయం చేస్తారు. ఆస్తి వ్యవహారాలు వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో మోసపోకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగులకు అధికారుల నుంచి అండ దండలు లభిస్తాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.