Horoscope Today: ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.. ఈ రోజు రాశి ఫలాలు

|

May 14, 2022 | 7:31 AM

కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు చేపట్టాలన్నా కొందరు తమ జాతకాలు, రాశిఫలాలను (Horoscope) అనుసరించేవారు చాలామంది ఉన్నారు.

Horoscope Today: ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.. ఈ రోజు రాశి ఫలాలు
Horoscope Today
Follow us on

Today Horoscope: జీవితంలో కొన్నిసార్లు మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు ఇబ్బందుల్లో పడేస్తుంటాయి. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు చేపట్టాలన్నా కొందరు తమ జాతకాలు, రాశిఫలాలను (Horoscope) అనుసరించేవారు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో శనివారం (మే 14న ) రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేషం: ఈ రాశి వారికి ఒక సంఘటన మానసిక శక్తిని పెంచి సంతోషంగా ఉండేలా చేస్తుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబసభ్యులు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి.

వృషభం: పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా త్వరగా పూర్తవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మానసిక ప్రశాంతత తగ్గకుండా.. నిర్ణయాలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మిథునం: ఈ రాశివారి శ్రమ ఫలిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగడంతోపాటు పలువురి నుంచి ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి తగిన ఆర్థిక సహాయం అందుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం: ఈ రోజు శుభవార్త అందుకుంటారు. చేపట్టిన పనులను ఉత్సాహంతో పూర్తిచేస్తారు. గతంలో పూర్తికాని పని కూడా పూర్తవుతుంది. కుటుంబసభ్యులతో కాలాన్ని గడుపుతారు.

సింహం: ఈ రాశి వారికి మిశ్రమ కాలం. పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఇబ్బందులను అధిగమిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త ఉండాలి.

కన్య: ఈ రాశి వారికి శుభకాలం.. అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. ముఖ్య విషయాల్లో కుటుంబసభ్యుల సూచనలు తీసుకోవడం మంచిది. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చు.

తుల: ప్రారంభించిన పనులల్లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సహకారం లభిస్తుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబసభ్యులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు.

వృశ్చికం: ఈ రాశి వారికి శుభకాలం.. ముఖ్యమైన వ్యవహారంలో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ఒక వ్యవహారంలో మెరుగైన ఫలితాలను అందుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. కొన్ని కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి.

ధనుస్సు: చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఒక శుభవార్త ఆనందాన్ని పెంచుతుంది. నూతన వస్తువులను కొంటారు. అవసరానికి తగిన ఆర్థిక సహాయం అందుతుంది.

మకరం: ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవ్వడంతోపాటు శారీరక శ్రమ అధికమవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తగదు. కీలక విషయాల్లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సూచనలు తీసుకోవడం మంచిది.

కుంభం: ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. సకాలంలో పూర్తిచేస్తారు. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను అందరినీ ఆకట్టుకుంటాయి. కానీ ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబసభ్యుల నుంచి సహకారం అందుతుంది.

మీనం: ఈ రాశి వారు తీసుకునే కీలక నిర్ణయం.. అందరినీ దృష్టిని ఆకట్టుకునేలా చేస్తుంది. అయితే.. నిర్ణయాలను తరచూ మార్చడం ఇబ్బందుల్లో పడేలా చేస్తుంది. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి.

Also Read:

Delhi Fire Accident: ఢిల్లీ దుర్ఘటనలో 27 మంది సజీవ దహనం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోడీ

Health Tips: ఆర్థరైటిస్‌ రోగులు ఈ ఆహార పదార్థాలని అస్సలు తినవద్దు.. ఎందుకంటే..?