Horoscope Today 14th March 2021: ఇప్పటికీ రాశి ఫలాలను విశ్వసించి.. తమ రోజును ప్రారంభించేవారు చాలా మందే ఉన్నారు. ఈరోజున ఏం జరగబోతుందనేది ముందుగానే తెలుసుకోవాలని కోరుకుంటుంటారు. అందుకోసం రాశిఫలాలను నమ్ముతుంటారు. ఈరోజు మార్చి 14 ఆదివారం సూర్య, చంద్రుల కలయిక మీనంలో జరగబోతుంది. అలాగే మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఈరోజు వీరికి శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగాల విషయంలో కొన్ని మార్పులు జరుగుతాయి. సుబ్రమణ్య స్వామి భుజంగా స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
ఈ రోజు వీరికి వ్యక్తిగతంగా, వ్యాపార విషయాల్లో కూడా కొంత ఒత్తిడి చోటు చేసుకుంటుంది. ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. నవగ్రహ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి మీకున్నటువంటి తెలివితేటలను మరింత ఉపయోగించుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఈరోజు శివార్చన మేలు చేస్తుంది.
ఈరోజు ఈ రాశివారికి ఉద్యోగాల విషయంలో అదనపు బాధ్యతలు చేపట్టే సందర్బాలు ఉంటాయి. అనారోగ్యాల భారీన పడకుండా.. జాగ్రత్తలు తీసుకోవాలి. నవగ్రహా స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి చేపట్టినటువంటి పనులు వాయిదా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగాల విషయంలో పనిభారం పెరుగుతుంది. గురుగ్రహా అర్చన మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి వ్యాపార విషయంలో కొంత మందకొడిగా సాగుతుంటాయి. ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు అంగారక అర్చన మేలు చేస్తుంది.
ఈరోజు వీరు వేరు వేరు చోట్ల రావాల్సిన బాకీలను వసూలు చేసుకుంటారు. ఆద్యాత్మిక, దైవచింతన కార్యాక్రమాల్లో పాల్గొంటుంటారు. ఈరోజు అష్టలక్ష్మీ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి ఆత్మీయుల నుంచి కొంత ఆహ్వానాలు అందుతుంటాయి. నిర్వహిస్తున్న వ్యాపారాలు శుభఫలితాలను కలిగిస్తాయి. విష్ణు సహస్త్ర నామ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాల స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. ఈరోజు శివార్చన మేలు చేస్తుంది.
ఈరోజు ఈరాశివారికి స్థిరచరఆస్తులు కొంత వృద్ది అయ్యే అవకాశాలున్నాయి. ఉద్యోగాది విషయాల్లో పదోన్నతుల కోసం ఎదురుచూస్తుంటారు. శ్రీరామ పట్టాభిషేకం నామస్మరణ చేస్తుండాలి.
ఈరోజు ఈరాశివారికి రావాల్సిన పాతబాకీలను వసూలు చేసుకుంటారు. ఉద్యోగాల విషయంలో అనుకూలమైనటువంటి మార్పులు జరుగుతాయి. ఈరోజు నవగ్రహ స్త్రోత్ర పారాయణం, శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి వ్యాపారా.. వ్యవహరిక విషయాలలో కొంత ప్రోత్సాహాకాలు ఉంటాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటుండాలి. పరమేశ్వరునికి అభిషేకం నిర్వహించడం మంచిది.