Horoscope Today 13th March 2021: ఇప్పటికీ రాశి ఫలాలను విశ్వసించి.. తమ రోజును ప్రారంభించేవారు చాలా మందే ఉన్నారు. ఈరోజున ఏం జరగబోతుందనేది ముందుగానే తెలుసుకోవాలని కోరుకుంటుంటారు. అందుకోసం రాశిఫలాలను నమ్ముతుంటారు. ఈరోజు మార్చి 13 శనివారం చంద్రుడు, శని కంభరాశిలో ఉండనున్నాడు. అలాగే ఈరోజు శని అమవాస్య సందర్భంగా.. మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి..
ఈరోజు మీరు చేపటునటువంటి పనులను జాగ్రత్తగా పూర్తిచేసుకుంటారు. అలగే సుబ్రమణ్య స్వామి దర్శనం మేలు చేస్తుంది.
వృషభ రాశి..
ఈరోజు సన్నిహితులతో వ్యవహరించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు నెమ్మదిగా వృద్ధిచెందుతాయి. శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.
మిధున రాశి..
ఈరోజు మీకు ఉద్యోగాల విషయంలో కొంత అనుకూలత ఉంటుంది. వ్యాపార విషయాలలో కొన్ని ఒప్పందాలను కుదుర్చుకుంటారు. నవగ్రహ స్త్రోత్ర పరాయణం మేలు చేస్తుంది.
కర్కాటక రాశి..
ఈరోజు మీరు పడే శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగాల విషయంలో కొన్ని చిక్కులను అధిగమించేందుకు ప్రయత్నించాలి. పేదవారికి అన్నధానం చేయడం మీకు ఈరోజు మంచిది.
సింహరాశి..
ఈరోజు మీరు చేపటునుంటినటువంటి పనులు కొన్ని పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల విషయంలో కొంత అనుకూలత కూడా ఉంటుంది. దక్షిణామూర్తి స్త్రోత్ర పరాయణం మేలు చేస్తుంది.
కన్యరాశి..
ఈరోజు మిత్రులతో, సన్నిహితులతో కొన్ని ఘర్షణలను జరిగే అవకాశాలున్నాయి. ఆలోచనలు కొంత జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళేందుకు ప్రయత్నించాలి. ఈరోజు పరమేశ్వరునికి అర్చన చేయడం మంచిది.
తులరాశి..
ఈరోజు పరిస్థితులు కొంత చక్కదిద్దేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో గౌరవం కోల్పోకుండా వ్యవహరించాలి. అష్టలక్ష్మీ స్త్రోత్ర పరాయణం మేలు చేస్తుంది.
వృశ్చిక రాశి..
ఈరోజు మీకు వేరు వేరు రూపాల్లో కిర్తీ ప్రతిష్టలు పెరిగే అవకాశాలున్నాయి. అభిమానులు, అనుచరులు మీపై కాస్తా నమ్మకం ఉంచుకుంటారు. బుదగ్రహ స్త్రోత్ర పరాయణం మేలు చేస్తుంది.
ధనుస్సు రాశి..
ఈరోజు మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు కొన్ని సార్లు వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి. ఆలోచనలో మార్పులు జరుగుతుంటాయి. చంద్రగ్రహ అర్చన మేలు చేస్తుంది.
మకర రాశి..
ఈరోజు మీకు మీ సోదరులతో కొంత వివాదాలు జరుగుతుంటాయి. ఆర్థిక ఇబ్బందులు, పనులు ఆలస్యం కావడం కొంత ఒత్తిడికి గురవుతుంటారు. శ్రీరామ రక్ష స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
కుంభరాశి..
ఈరోజు నూతనమైనటువంటి కొన్ని పనులు చేపట్టేందుకు మంచి రోజు కోసం వేచి చూస్తుంటారు. ఉద్యోగాల విషయంలో కొన్ని హోదాలను పొందే అవకాశాలున్నాయి. విష్ణు సహస్త్ర స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
మీనరాశి..
ఈరోజు మీకు మిత్రులతు వివాదాలు జరుగుతుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు జరుగుతుంటాయి. ఈరోజు గురుగ్రహ అర్చన చేయడం మంచిది.
Also Read:
MahaShivaratri 2021 : మన ఇండియాలో ఉన్న అత్యంత ఎత్తైన శివుడి విగ్రహాలు.. ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా..