Horoscope Today: ఈ రాశివారు అత్యవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.. శుభవార్తలు వింటారు

|

Oct 12, 2021 | 7:18 AM

Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు..

Horoscope Today: ఈ రాశివారు అత్యవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.. శుభవార్తలు వింటారు
Horoscope Today
Follow us on

Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అందుకే పనులను మొదలుపెట్టే ముందు కొంతమంది తమ జాతకం, దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 12న ) మంగళవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం రాశి:

అత్యవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆక‌స్మిక ధ‌న న‌ష్టం క‌లిగే అవ‌కాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో స‌హ‌నం వ‌హించ‌క త‌ప్ప‌దు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది.

వృష‌భ రాశి:

ఈ రాశివారు అనారోగ్య సమస్యల నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. కొత్త శుభ కార్యాలు చేపడతారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధ‌న న‌ష్ట‌ం ఏర్పడే అవకాశం ఉంది. ఇతరుల సహాయం కోసం వేచి చూడాల్సిన ఉంటుంది.

మిథున రాశి:

విద్యార్థులు విజ‌యాన్ని సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.

క‌ర్కాట‌క రాశి:

నూత‌న వ‌స్తు, వ‌స్త్ర‌, వాహ‌న, ఆభ‌ర‌ణ‌, లాభాల‌ను పొందుతారు. రావాల్సిన డబ్బులు సకాలంలో చేతికందుతాయి. శుభ‌వార్త‌లు వింటారు. చేపట్టే పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఇతరు విషయాలలో జోక్యం కలిగించుకోకపోవడం మంచిది.

సింహ రాశి:

వ్యవసాయ రంగంలో మంచి లాభాలు ఉంటాయి. ఈ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. రాజకీయ రంగాలలో ముందుకు సాగుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

క‌న్య రాశి:

ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఏదో ఒక విష‌యంలో మ‌న‌స్తాపానికి గురవుతారు. ఇతరుల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.

తుల రాశి:

ఆర్థిక ఇబ్బందులు ఉండవు. వ్యాపారాలు ముందుకు సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కొత్త వాహనాలు, వస్త్రాలు, అభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇతరుల నుంచి శుభవార్తలు వింటారు.

వృశ్చిక రాశి:

ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చేపట్టే పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అధ్యాత్మీక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. స్నేహితులను కలుసుకుంటారు.

ధ‌న‌స్సు రాశి:

ఆక‌స్మిక ధ‌న‌లాభ‌ం అందుతుంది. రాజ‌కీయ రంగంలోని వారికి, క్రీడాకారుల‌కు మంచి ఫలితాలు ఉంటాయి. చేపట్టే పనులలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు నికలడగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి మంచి జరుగుతుంది. లాభాలు గడిస్తారు.

మ‌క‌ర రాశి:

వృత్తి, ఉద్యోగ‌రంగాల్లో శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలకు భంగం కలుగకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.

కుంభ రాశి:

కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండేందుకు మాన‌సిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు ల‌భిస్తుంది. వాయిదా వేయ‌బ‌డిన కొన్ని ప‌నులు ఈరోజు పూర్తి చేసుకోగ‌లుగుతారు. ముఖ్య‌మైన వ్య‌క్తులను కలుసుకుంటారు.

మీన రాశి:

ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. ఆకస్మిక ధన లాభం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ప్ర‌యాణాలు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది.

ఇవీ కూడా చదవండి:

చాణక్య నీతి: ఆ 4 విషయాలలో మహిళలు పురుషుల కంటే ముందుంటారు..!

CM YS Jagan in Tirumala: తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు, సారె సమర్పించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి