దిన ఫలాలు (డిసెంబర్ 9, 2024): మేష రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి అనుకోకుండా బయటపడతారు. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. మిథున రాశి వారికి ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి అనుకోకుండా బయటపడతారు. కొన్ని పనులు, వ్యవహారాల్ని చాలావరకు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామి సలహాలతో కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో అదనపు పని భారం తప్పకపోవచ్చు. ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. కుటుంబ వాతావ రణం సానుకూలంగా ఉంటుంది. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. కొద్దిపాటి ప్రయత్నంతో నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు. చేపట్టిన పనులను గట్టి పట్టుదలతో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగులు శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను అమలు చేస్తారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆస్తి వివాదానికి సంబంధించి తోబుట్టువులతో రాజీమార్గం అనుసరిస్తారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు బాగా వృద్ధి చెందుతాయి. ప్రయాణాల్లో లాభదాయక పరిచయాలు కలుగుతాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాలలో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు విశేషంగా రాణి స్తాయి. ఆదాయం ప్రయత్నాల్లో రోజంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. చాలా కాలంగా పీడిస్తున్న వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. ఉద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆదాయపరంగా సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యవహారాలు, ఆదాయ ప్రయ త్నాలు సత్ఫలితాలనిస్తాయి. కొద్ది వ్యయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఇప్పుడు చేపట్టే కార్యక్రమాలు ఆశించిన ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరిగి, బాధ్య తలు మారుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలకు లోటుండదు. వ్యక్తిగత సమస్య లకు ఊహించని పరిష్కారం లభిస్తుంది. కొందరు బంధుమిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొం టారు. కొద్దిపాటి ప్రయత్నంతో బంధువర్గంలోనే మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థికంగా ఆశింశిన పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో మీ ప్రతిభను, శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారు. మీ సలహాలు, సూచనలు అధికారులకు బాగా ఉపయోగపడతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయ టపడతారు. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి అనుకో కుండా పరిష్కారం అవుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించి విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో మీ ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఉన్నత వర్గాలతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహంతో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా, సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. రావలసిన సొమ్మును వసూలు చేసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగ జీవితం చాలావరకు సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ సవ్యంగా, సకాలంలో పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని విధంగా విజయం సాధిస్తారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. అధికారుల నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. గౌరవ మర్యాదలకు లోటుండదు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.