Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అందుకే పనులను మొదలుపెట్టే ముందు కొంతమంది తమ జాతకం, దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (నవంబర్ 6)న శనివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేష రాశి:
ఈ రాశివారికి ఈ రోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి సలహాలు, సూచనలు పొందుతారు.
వృషభ రాశి:
కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పనులు చేపట్టే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
మిథున రాశి:
చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. అధిక శ్రమ తప్పదు. ఆర్థికంగా మెరుగుపడతారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
కర్కాటక రాశి:
ఆశించిన మేర ఫలితాలు పొందుతారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలమవుతారు. చేపట్టిన పనులలో మంచి ఫలితాలు అందుకుంటారు.
సింహ రాశి:
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు తప్పవు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.
కన్య రాశి:
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పనిలో శ్రమ పెరిగినా.. ధైర్యంతో ముందుకెళ్లి విజయం సాధిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం కలిగించుకోకపోవడం మంచిది.
తుల రాశి:
వ్యాపారంలో ముందుకు సాగుతారు. ఆశించిన ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు తప్పవు. పెద్దల నుంచి సలహాలు పొందుతారు. కాస్త శ్రమ పెరుగుతుంది.
వృశ్చిక రాశి:
మంచి పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ఒక శుభవార్త మిమ్మల్ని సంతోష పెడుతుంది.
ధనుస్సు రాశి:
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కీలక వ్యవహారాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.
మకర రాశి:
చేపట్టిన పనులలో మంచి ఫలితాలు ఉంటాయి. కొన్ని విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఇతరులు చెప్పిన మాటలు వినకపోవడం మంచిది.
కుంభ రాశి:
బంధువుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఏ పని చేపట్టినా ధైర్యంతో ముందుకెళితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీన రాశి:
ఎక్కువగా కష్టపడితే మంచి ఫలితాలు ఉంటాయి. కీలక విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. బంధుమిత్రులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి.
ఇవి కూడా చదవండి: