Horoscope Today: ఆర్థిక సమస్యల నుంచి వారు బయటపడుతారు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Oct 05, 2024 | 5:01 AM

దిన ఫలాలు (అక్టోబర్ 5, 2024): మేష రాశి వారు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతాల పెరుగుదలకు సంబంధించిన శుభవార్త అందుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగులకు ఆశించిన స్థాయిలో హోదాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆర్థిక సమస్యల నుంచి వారు బయటపడుతారు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
Horoscope Today 05th October 2024
Follow us on

దిన ఫలాలు (అక్టోబర్ 5, 2024): మేష రాశి వారు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతాల పెరుగుదలకు సంబంధించిన శుభవార్త అందుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగులకు ఆశించిన స్థాయిలో హోదాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

  1. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను త్వరితగతిన పూర్తి చేయగలుగుతారు. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
  2. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతాల పెరుగుదలకు సంబంధించిన శుభవార్త అందుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదంలో వ్యవహారాల్లో రాజీ మార్గం అనుసరిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో తప్పకుండా కార్య సిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది.
  3. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగులకు ఆశించిన స్థాయిలో హోదాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. వృత్తి జీవితం నిలకడగా సాగిపోతుంది. అనుకోకుండా ఆస్తి వివాదం పరి‌ష్కారం అవుతుంది. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. కుటుంబ వాతావ రణం ఉత్సాహంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూ లతలు పెరుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
  4. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగంలో అదికారం చేపట్టే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆర్థికంగా దూసుకుపోతeాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చు బాగా పెరుగుతుంది. కొందరు మిత్రుల వల్ల ఇరకాటంలో పడతారు. ధనపరంగా ఇతరులకు వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం వంటివి చేయవద్దు.
  5. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉంది. ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం కనిపిస్తుంది. కొందరు బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. పెండింగ్ పనులు కొద్ది శ్రమతో పూర్తి అవుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ వస్తుంది.
  6. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది. అనుకోకుండా కొన్నిముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం వరిస్తుంది. అదనపు ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలను చక్క బెడతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. కుటుంబ జీవితంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  7. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగంలో అధికార యోగం పట్టడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. ఆదాయంలో బాగా పెరిగే అవకాశం ఉంది. ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. రావలసిన డబ్బు వసూలు అవుతుంది. కొందరు బంధుమిత్రులకు సహాయం చేస్తారు. నిరుద్యో గుల ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.
  8. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): వృత్తి, ఉద్యోగాల్లో వేతనాల పెరుగుదలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారంలో కొద్దిగా లాభాలు కనిపిస్తాయి. అనవసర ఖర్చుల్ని చాలావరకు తగ్గించుకుంటారు. ఆదాయ పరి స్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ఇంటా బయటా అనుకూలతలు కలుగుతాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు. నిరుద్యోగులు ప్రయత్నాల్ని పెంచాల్సి ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
  9. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వృత్తి, ఉద్యోగాలపరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో కూడా పెట్టుబడులకు తగ్గ ప్రతిఫలం అందుకుంటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక వ్యవహా రాలు లాభదాయకంగా కొనసాగుతాయి. ఆదాయం అంచనాలకు మించి వృద్ధి చెందుతుంది. చేప ట్టిన పనుల్ని చక చకా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొందరు చిన్ననాటి మిత్రుల్ని కలవడం ఆనందాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి.
  10. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగంలో మీ సమర్థతకు సరైన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగి పోతాయి. పని ఒత్తిడి నుంచి బాగా విముక్తి లభిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా బయటపడే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృథా ఖర్చులను తగ్గించుకుంటారు. ఉద్యోగ ప్రయత్నంలో విజయం సాధించే అవకాశం ఉంది. ఇతరులతో ఆలోచించి మాట్లాడడం మంచిది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.
  11. కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. తలపెట్టిన ముఖ్యమైన పనులు నిదానంగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అప్రయత్నంగా పరిష్కారం అవుతుంది. పెళ్లి ప్రయత్నాలలో కొద్దిగా ఆశాభంగం తప్పకపోవచ్చు.
  12. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, ఉద్యోగాలలో అధికారులు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. దూరపు బంధు వుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. తల్లితండ్రుల జోక్యంతా ఆస్తి వివాదం పరిష్కార మవుతుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. కుటుంబం మీద ఖర్చు పెరుగుతుంది.