AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మే 5 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం బూస్ట్.. పదోన్నతులకు ఛాన్స్..!

దిన ఫలాలు (మే 5, 2026): ఈ రోజు చాలా రాశుల వారికి ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మేషం నుంచి మీనం వరకు చాలా మంది ఉద్యోగంలో ప్రాధాన్యం, పదోన్నతులు, ఆదాయం పెరుగుదల వంటి శుభ పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కొన్ని రాశుల వారు పనిభారం, ఖర్చులు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ రోజు వృత్తి, వ్యాపారాల్లో పురోగతి, కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి.

మే 5 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం బూస్ట్.. పదోన్నతులకు ఛాన్స్..!
Rashifal In Telugu 05 May 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 05, 2026 | 5:45 AM

Share

దిన ఫలాలు (మే 5, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో ప్రాధాన్యం పెరగడంతో పాటు బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం ఎక్కువగానే ఉన్నప్పటికీ, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. మిథున రాశి వారు ఉద్యోగంలో పదోన్నతి, జీతభత్యాల పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరగడంతో పాటు బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక, ఆదాయ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. గృహ వాతావరణం సామరస్యంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. నిరుద్యోగులు ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం ఎక్కువగానే ఉన్నప్పటికీ, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. ఇంటా బయటా ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అనుకోని మార్గంలో ఆదాయం కలిసి వస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వ్యాపార వ్యవహారాలు ఆశించిన విధంగా పురో గతి చెందుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో పదోన్నతి, జీతభత్యాల పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులు తమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు కూడా సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. పుణ్య కార్యాల మీద ఎక్కువగా ఖర్చవుతుంది. దాంపత్య జీవితం బాగా అనుకూలంగా సాగిపోతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు అందుకుంటారు. కానీ పని భారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. కొద్దిగా ఆలస్యం గానే అయినప్పటికీ ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని పట్టుదలగా చక్కబెడతారు. ఒక అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. నిరుద్యోగులు తమకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆదాయంలో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. వృథా ఖర్చులు తగ్గించుకోవాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. వృత్తి జీవితం చాలావరకు సాఫీగా, నిలకడగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు తగ్గే సూచనలున్నాయి. మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. సకాలంలో ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. రావలసిన డబ్బు చేతికి అంది అవసరాలు తీరిపోతాయి. ఆరోగ్యం పరవాలేదు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు అమలు చేసి ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి సారిస్తారు. ఆరోగ్యం విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. పదోన్నతికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన దానికంటే రాబడి బాగా పెరుగుతుంది. ప్రస్తుతం అన్ని రంగాలవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. ఏ పని తలపెట్టినా సఫలం అవుతుంది. వ్యక్తిగత, కుటుంబ స‍మస్యలు ఒకటి రెండు పరిష్కారం అవుతాయి. ఆస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకోని ఖర్చులతో ఇబ్బంది పడతారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశముంది. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సఫలం అయ్యే సూచనలున్నాయి. ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. పదోన్నతి సూచనలున్నాయి. కొద్దిగా జాగ్ర త్తగా వ్యవహరిస్తే ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. ఏ పని తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనేక విధాలుగా లాభాలు అందే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో మీ ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం మంచిది. శరీరానికి విశ్రాంతి అవసరం అని గ్రహించండి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో ఆశించిన విధంగా స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో సంపాదన పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. సోదర వర్గంతో ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. మిత్రులతో ఒక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో ఆలయానికి వెడతారు. కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆశించిన శుభవార్త వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగుల శ్రమకు, ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. జీతభత్యాలు గానీ అదనపు రాబడి గానీ పెరిగే అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో తప్పకుండా ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఇంటా బయటా విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగంలో అధికారులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేయకపోవడం మంచిది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

Follow Us