
దిన ఫలాలు (జూన్ 4, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగం విషయంలో ఆశించిన శుభ వార్తలు అందుతాయి. వృషభ రాశి వారికి కుటుంబ విషయాల్లో కొద్దిపాటి చిక్కులుంటాయి. ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. మిథున రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగం విషయంలో ఆశించిన శుభ వార్తలు అందుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. కొన్ని కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రముఖు లతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయటా ఏ పని ప్రారంభించినా అనుకూలంగా మారు తాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశముంది. ఆర్థిక సంబంధమైన ఎటువంటి ప్రయత్నమైనా సఫ లం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులు మంచి అవకాశాలు పొందు తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
కుటుంబ విషయాల్లో కొద్దిపాటి చిక్కులుంటాయి. ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఖర్చుల్ని అదుపు చేయడం మంచిది. ఏ పనయినా నిదానంగా పూర్తవుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాల్లో ఉత్సాహవంతమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి అనుకూలత ఉన్నా సహోద్యోగుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశముంది. పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా విసుగు తెప్పిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యానికి లోటుండదు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
తప్పకుండా అప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. కొందరు బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశముంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సమాజంలో ఆదరణ బాగా వృద్ధి చెందుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన రుణాలు తీర్చగలుగుతారు. ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక సహాయాల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితులు బాగా చక్కబడతాయి. ప్రయా ణాల వల్ల ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారాల్లో కొన్ని సమస్యలు, వివా దాలు తొలగిపోయే అవకాశముంది. నిరుద్యోగులు కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగపరంగా విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఇంట్లో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
సింహం (మఖ, పుబ్బ. ఉత్తర 1)
చేపట్టిన ప్రతి పనీ సఫలం అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. కొందరు ఇష్టమైన బంధువుల నుంచి ఊహిం చని ఆహ్వానాలు అందుతాయి. ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం సాదా సాతాగా సాగిపోతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
కొందరు అభిమాన బంధువులను శుభకార్యంలో కలుసుకుంటారు. కుటుంబ జీవితం ఆనందో త్సాహాలతో సాగిపోతుంది. ఆస్తి సంబంధమైన వివాదాలు రాజీమార్గంలో పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఉద్యోగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో బిజీగా ఉండడమే కాకుండా ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆహార, విహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
కీలక వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేయడం మంచిది. కుటుంబ సభ్యుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. స్థిరాస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఎక్కువగా దైవకార్యాల మీద దృష్టి పెడతారు. కొద్దిపాటి అనారోగ్య సూచనలున్నాయి. ఉద్యోగంలో అదనపు పని భారం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా, సానుకూలంగా సాగిపోతాయి. ప్రతి పనిలోనూ శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీల నుంచి ఎక్కువగా ఆశించకపోవడం మంచిది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వ్యాపారపరంగా కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. చేపట్టిన పనులన్నీ విజ యవంతంగా ముందుకు సాగుతాయి. కుటుంబపరంగా కొన్ని చికాకులుంటాయి. ఇతరుల కోసం రుణాలు చేసే అవకాశం ఉంది. బంధువులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సా హకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. ఒకరిద్దరు మిత్రు లకు సహాయం చేయడం జరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
చేపట్టిన ప్రతి పనీ సఫలం అవుతుంది. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. సహాయ సహకారాలు అందించడానికి మిత్రులు ముందుకు వస్తారు. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచ నలు ప్రవేశపెట్టి లబ్ధి పొందుతారు. కొద్ది ప్రయత్నంతో కొన్ని వ్యక్తిగత కష్టనష్టాల నుంచి బయట పడతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాల విషయంలో విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
చాలా కాలంగా మానసిక ఒత్తిడి కలిగిస్తున్న ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయ టపడే అవకాశముంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. దగ్గర బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వాహన యోగం పట్టే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా అనుకూలంగా మారుతుంది. నిరు ద్యోగులకు ఊహించని ఆఫర్లు అందే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఇతరులకు ఎవరికీ ధనపరంగా వాగ్దానాలు చేయడం, హామీలు ఉండకపోవడం మంచిది. వ్యక్తిగత ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అవాంతరాలు తొలగిపోతాయి. నష్టాల నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది. బంధుమిత్రుల వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉండవచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక విషయాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ఆదాయ ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడతాయి. బంధువుల నుంచి శుభవార్తలతో పాటు దుర్వార్తలు కూడా అందే అవకాశం ఉంది. ముఖ్యంగా పెళ్లి ప్రయత్నం విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా, సంతృ ప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగానికి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.