Horoscope Today: వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Dec 02, 2023 | 5:01 AM

దిన ఫలాలు (డిసెంబర్ 2, 2023): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ఎదుగుదల ఉంటుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. వృషభ రాశి వారికి ఆర్థిక సంబంధమైన ఒత్తిళ్లకు అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. మిథున రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
Horoscope Today 02nd December 2023
Follow us on

దిన ఫలాలు (డిసెంబర్ 2, 2023): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ఎదుగుదల ఉంటుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. వృషభ రాశి వారికి ఆర్థిక సంబంధమైన ఒత్తిళ్లకు అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. మిథున రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ఎదుగుదల ఉంటుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో పోటీదార్లతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కొత్త ప్రయ త్నాలు, ఆలోచనలతో ముందుకు వెడతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రముఖులతో ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాగ్వా దాలకు దూరంగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి గురికావడం వంటివి జరిగే అవకాశం ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక సంబంధమైన ఒత్తిళ్లకు అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారుల నుంచి, సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. ఇష్టమైన బంధుమిత్రులతో కలిసి శుభ కార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం కాకపోవచ్చు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. వాగ్దానాలు చేయవద్దు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. రావలసిన బాకీలు, బకాయిలు వసూలు అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలలో ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. ఆదరణ పెరుగుతుంది. వ్యాపా రాల్లో లాభాలు పెరుగుతాయి. కొందరు బంధుమిత్రులకు అండగా నిలబడడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన విధంగా ఆఫర్ వచ్చేఅవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

అనుకున్న పనులు చురుకుగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పని భారం బాగా పెరుగు తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు మంచి స్పందన లభిస్తుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఒడిదుడుకులకు లోనవుతుంది. వృత్తి, ఉద్యోగాలు భారంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం అన్యోన్యంగా, సామరస్యంగా ముందుకు సాగిపోతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఇతరులకు సహాయం చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కొందరు మిత్రుల వల్ల నష్టపోతారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండవచ్చు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. అన్నీ మీరనుకున్నట్టే జరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్లి ప్రయత్నాలకు అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలతో దూసుకు పోతారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో శుభవార్తలు అందుతాయి. ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. తల్లి తండ్రులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. కుటుంబపరంగా అభివృద్ధి ఉంటుంది. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధం గానే నెరవేరుతాయి. బంధువులు విమర్శలు చేసే అవకాశం ఉంది. సతీమణి సహకారం లభి స్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. మిత్రుల సాయంతో ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా పూర్తవు తాయి. జీవిత భాగస్వామికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచ యాలు పెంపొందుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో భద్రత, స్థిరత్వం లభిస్తాయి. సామాజికంగా అనుకోని గుర్తింపు లభిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. బంధువుల నుంచి శుభ వార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాలలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగుల నుంచి ఒత్తిడి ఉండవచ్చు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. కోపతాపాలు తగ్గించుకోవడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన దేవాల యాన్ని సందర్శిస్తారు. సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశాలలో వృత్తి, ఉద్యోగాలలో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. వాగ్దానాలకు, హామీలకు దూరంగా ఉండాలి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అనవసర వ్యవహారాల మీద డబ్బు ఎక్కువగా ఖర్చవుతుంది. అవాంఛనీయ పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల విషయంలో శుభ వార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.