Weekly Horoscope: వార ఫలాలు.. ఈ వారంలో వారు వ్యాపారాలలో రాణిస్తుంటారు.. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు

Weekly Horoscope: ఈ ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు చాలా మందే..

Weekly Horoscope: వార ఫలాలు.. ఈ వారంలో వారు వ్యాపారాలలో రాణిస్తుంటారు.. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు
Follow us

|

Updated on: Jun 13, 2021 | 7:38 AM

Weekly Horoscope: ఈ ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు చాలా మందే ఉంటారు. తమ రోజు ఎలా ఉండబోతుంది.. ఎలాంటి పనులు మొదలు పెట్టాలి.. అని తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో భాగంగానే ఈ వారం రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషరాశి

ఈ రాశివారికి ఈ వారంలో మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేయగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులను పరిచయం చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగు పడతాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. వ్యాపారాలు ముందుకు సాగి మంచి లాభాలు పొందుతారు. రాశి వారు గణేశాష్టకం పఠించడం ఎంతో మేలు చేస్తుంటుంది.

వృషభరాశి

ఈ రాశి వారికి ఈ వారంలో ఆదాయం అంతగా ఉండదు. కొత్తగా అప్పులు చేసే అవకాశం ఉంది. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ఈ వారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఏర్పడుతాయి. నిరుద్యోగుల యుత్నాలు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలలో నిరాశాజనకంగా ఉంటుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విష్ణుధ్యానం చేయడం ఎంతో మేలు చేస్తుంటుంది.

మిథునం:

విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉంటాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు పనులను దక్కించుకుంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. వారం చివరలో ఆస్తుల వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు దేవీస్తోత్రాలు పఠించడం ఎంతో మేలు చేస్తుంటుంది.

కర్కాటక రాశి:

ఈ రాశివారికి ఈ వారంలో ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి కొంత గట్టెక్కుతారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు దక్కే అవకాశాలుంటాయి. న్యాయపరమైన విషయాలలో ఇబ్బందులు తొలగిపోతాయి. పట్టదలతో చేసిన పనులలో విజయం సాధించే అవకాశం ఉంది. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో బంధువులతో విరోధాలు ఉండే అవకాశం ఉంటుంది. ఆంజనేయని దర్శించుకోవడం ఎంతో మేలు జరుగుతుంది.

సింహరాశి

ఈ రాశివారు ముఖ్యమైన పనులను పూర్తి చేసుకుంటారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. అందరిలో మంచి పేరు సంపాదించుకుంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారాలు మరింత ముందుకు సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు తొలగిపోతాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బందులు పట్టే అవకాశం ఉంటుంది. ఆస్తి వివాదాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు హనుమాన్‌ చాలీసా పఠించడం ఎంతో మేలు చేస్తుంటుంది.

కన్యరాశి

దూరపు బంధువుల నుంచి కీలక వార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. ప్రముఖాలతో మంచి సంబంధాలు ఏర్పర్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. వ్యాపారాలలో పెట్టుబడులతో పాటు లాభాలు పొందుతారు. ఈ వారం మధ్యలో ఆదాయం ఇబ్బందులు, కుటుంబ సభ్యులతో తగాదాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ వారంలో ఈ రాశివారు లక్ష్మీస్తోత్రాన్ని పఠించడం మంచిది.

తులరాశి

ఈ వారంలో ఈ రాశివారు కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మిత్రులతో మరింత ఉత్సాహంగా ఉంటారు. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. భూములు, అభరణాలు సమకూర్చుకుంటారు.కొన్ని సమస్యల నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నిస్తుంటారు. వ్యాపారాలలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. వారం ప్రారంభంలో ఆదాయం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆప్తులతో మాటపట్టింపులు ఉంటాయి. ఈ రావివారు శివాష్టకాన్ని పఠించడం ఎంతో మేలు చేస్తుంటుంది.

వృశ్చిక రాశి

ఆర్థిక లావాదేవీల విషయాలలో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. పలుకుబడిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంటుంది. ఆస్తుల విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు, అభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పెంచుకుంటారు. ఉద్యోగాలలో పనిభారం కొంత తగ్గుతుంది. ఈ వారంలో ఈ రాశివారు అనారోగ్యంతో బాధపడే అవకాశం ఉంది. శ్రీరామరక్షాస్తోత్రాన్ని పఠించడం ద్వారా కొంత మేలు జరుగుతుంది.

ధనుస్సు రాశి

ఈ రాశివారు ఈ వారంలో అనుకున్న పనులను నెరవేర్చుకుంటారు. సమాజంలో మంచి గౌరవం ఏర్పర్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. ఉద్యోగాలలో ఉన్న వివాదాల నుంచి బయటపడతారు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబ సభ్యులతో ఇబ్బందులు. ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు. ఈ రాశివారు ఈ వారం వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించడం ద్వారా మేలు జరుగుతుంది.

మకర రాశి

ఈ రాశివారు ఈవారంలో ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఇంత కాలం పడిన శ్రమ ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితుల నుంచి మంచి సమాచారం అందుకుంటారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి నూత ఉత్తేజం, ప్రయాణాలు చేస్తుంటారు. ఈ రాశివారు గణపతి నామస్మరణం చేయడం ఎంతో మేలు చేస్తుంటుంది.

కుంభ రాశి

కొత్త పనులు చేపడతారు. అందరిని మంచి పేరు సంపాదించుకుంటారు. స్నేహితుల నుంచి కూడా మంచి ప్రోత్సాహం అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తుంటారు. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. వ్యాపారాలు చేసేందుకు ముందుకు వస్తుంటారు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. రాజకీయాలలో ఉన్నవారికి మంచి జరుగుతుంది. వారం చివరిలో కుటుంబ సభ్యులతో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు అమ్మవారి నామస్మరణ చేయడం మేలు జరుగుతుంది.

మీన రాశి

ఈ రాశివారికి ఈ వారం మంచి జరుగుతుంది. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. సోదరులతో కొంత విబేధాలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారాలు మరింత ముందుకు సాగుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్య సమస్యలు వెంటాడే అవకాశం ఉంది. ఈ రాశివారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ వారం ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశివారు గణపతి, శ్రీరామ స్తోత్రాన్ని పఠించడం ద్వారా మంచి జరుగుతుంది.

'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..