
మార్చి 14న హోలీ పండుగ రోజే చంద్రగ్రహణం. ఈ సంవత్సరంలో ఇదే మొదటి చంద్రగ్రహణం. అయితే ఈ గ్రహణం ప్రభావం భారత్‌పై అంతగా ప్రభావం చూపదు అంటున్నారు నిపుణులు. కానీ రాశులపై మాత్రం దీని ఎఫెక్ట్ ఉంటుందంట.

జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం, చంద్ర గ్రహణం కన్యా రాశిలో సంభవిస్తుందంట, ఈ సమయంలో అదే రాశిలో కేతువు ఉండటం, ఆరోజే సూర్యుడు మీన రాశిలోకి, చంద్రుడు కన్యారాశిలోకి సంచరించడం జరుగుతుందంట. దీని వలన మూడు రాశులకు అదృష్టం కలిసి వస్తుంది. అవి ఏ రాశులు అంటే?

మేష రాశి వారికి చంద్రగ్రహణం, గ్రహాల సంచారం వలన అదృష్టం కలిసి వస్తుందంట. ధనలాభం కలుగుతుంది. అలాగే వీరు చేపట్టిన పనులన్నీ సక్సెస్ అవుతాయి. అంతే కాకుండా వీరు ఏ పని చేసినా అందులో విజయం వీరిదే అవుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

హోలీ రోజే చంద్ర గ్రహణం కారణంగా మూడు రాశులకు మహార్దశ ఏర్పడనుంది. ఈ రాశుల్లో ఒక్కటైన కర్కాటక రాశి వారికి దీంతో అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్, నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఇంట్లో ఆనందకర వాతావరణం నెలకొంటుందంట.

మిథున రాశి వారికి ఊహించని ధన సంపద వస్తుందంట. వీరు ఈ రోజుల్లో చాలా ఆనందంగా ఉంటారు. ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంటా, బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది.