Health Horoscope 2024
జ్యోతిషశాస్త్రం ప్రకారం ఆరవ స్థానాన్ని బట్టి అనారోగ్యం గురించి, 11వ స్థానాన్ని బట్టి కోలుకోవడం గురించి చెప్పాల్సి ఉంటుంది. ఇందులో 11వ స్థానం బాగా అనుకూలంగా ఉండే పక్షంలో అనారోగ్యాల నుంచి తప్పకుండా కోలుకునే అవకాశం ఉంటుంది. కనీసం సరైన చికిత్స లభించే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది చివరి వరకూ ఉండే గ్రహ సంచారాన్ని బట్టి చూసినట్టయితే, మేషం, వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మీన రాశులకు అనారోగ్యాల నుంచి కోలుకునే అవకాశం కనిపిస్తోంది. వీరికి అనారోగ్యాలు దగ్గరకు వచ్చే అవకాశం ఉండదు. ఇప్పటికే అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న వారు మాత్రం దాదాపు పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుంది.
- మేషం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో కేతువు ఉండడం వల్ల అకస్మాత్తుగా, అనూహ్యంగా స్వల్ప అనా రోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంటుంది. లాభస్థానంలో శనీశ్వరుడు బలంగా ఉన్నందు వల్ల ఎటువంటి అనారోగ్యం నుంచయినా బయటపడే అవకాశం ఉంటుంది. ఆ రాశివారిలో త్వరగా కోలుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా తలకు సంబంధించిన అనారోగ్యాలు, బీపీ, రక్త సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉండకపోవచ్చు.
- వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో రాహు సంచారం వల్ల సాధారణంగా అనారోగ్య సమస్యలు ఉండవు. అనారోగ్యం పట్టుకుంటే మాత్రం ఒక పట్టాన విడిచిపెట్టదు. అందువల్ల ఆహార, విహారాల్లో ఎంతగా జాగ్రత్తలు పాటిస్తే అంత మంచిది. ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్య అయినప్పటికీ, ఈ ఏడాది పూర్తిగా నయం కావడం జరుగుతుంది. సాధారణంగా గొంతు, మెడ, సైనస్ వంటి సమ స్యలు వీరిని బాధించే అవకాశం ఉంది కానీ, ఈ ఏడాది ఉపశమనానికే ఎక్కువ అవకాశం ఉంది.
- కర్కాటకం: ఈ రాశివారికి లాభ స్థానంలో గురువు సంచారం వల్ల ఎటువంటి అనారోగ్యం నుంచయినా కోలు కోవడం జరుగుతుంది. ఈ రాశివారిని ఎక్కువగా మధుమేహం, ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాస కోశ సంబంధమైన సమస్యలు బాధిస్తాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఈ ఏడాది ఏ అనారోగ్యమైనా అదుపులో ఉండడం లేదా ఉపశమనం లభించడం జరుగుతుంది. ప్రస్తు తం గ్రహ బలం అనుకూలంగా ఉన్నందువల్ల వీరికి సకాలంలో సరైన చికిత్సా సౌకర్యం లభిస్తుంది.
- తుల: ఈ రాశికి లాభ స్థానంలో రవి, బుధులు కలిసి ఉండడం వల్ల అనారోగ్యాల నుంచి తప్పకుండా ఉపశమనం లభిస్తుంది. రవి కారణంగా వీరికి సకాలంలో సరైన వైద్య చికిత్స లభించే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ రాశివారికి జీర్ణాశయం, పాంక్రియాస్, నడుం నొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. వీరు కొద్ది కాలంలో వీటి నుంచి విముక్తి పొందడం జరుగు తుంది. శస్త్ర చికిత్స ద్వారా నయమయ్యే సూచనలున్నాయి. మొత్తం మీద ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
- వృశ్చికం: ఈ రాశివారు కొద్ది కాలం పాటు స్వల్పకాలిక అనారోగ్యాలతో మాత్రమే ఇబ్బంది పడడం జరుగు తుంది. సాధారణంగా అకస్మాత్తుగా వీరు అనారోగ్యానికి గురి కావడం, అంతే అకస్మాత్తుగా దాని నుంచి బయటపడడం జరుగుతుంటుంది. పొత్తి కడుపు, తొడలు, మోకాళ్ల సంబంధమైన సమస్య లతో బాధపడే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది వీరు ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. లాభస్థానంలో శుక్ర, కేతువుల సంచారం వల్ల వీరికి త్వరితగతిన ఉపశమనం లభిస్తుంది.
- మీనం: ఈ రాశికి షష్ట స్థానంలో రవి సంచారం వల్ల, లాభ స్థానాధిపతి శని అనుకూలంగా ఉన్నందువల్ల దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి చాలావరకు ఊరట లభిస్తుంది. వీరికి సరైన వైద్య చికిత్స లభి స్తుంది. సాధారణంగా ఈ రాశివారికి నరాలు, ఎముకలు, కాళ్లు, తిప్పట వంటి సమస్యలుండే అవకాశం ఉంది. అయితే, రవి కారణంగా వీరికి ఈ ఏడాది తీవ్రస్థాయి అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉండకపోవచ్చు. గ్రహాల అనుకూలత వల్ల శీఘ్రగతిన కోలుకునే అవకాశం ఉంటుంది.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి