గురు మూఢమి ఎఫెక్ట్.. ఆ రాశుల వారు ఆస్తిపాస్తుల విషయంలో అలర్ట్..!

జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు ఏర్పడే గురు మూఢమి ప్రభావంతో కొన్ని రాశుల వారు ఆస్తి, ధన సంబంధిత నిర్ణయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారు కొత్త పెట్టుబడులు, ఇంటి కొనుగోలు, ఆస్తి వ్యవహారాలను తాత్కాలికంగా వాయిదా వేయడం మంచిది. ఇప్పటికే ప్రారంభించిన పనులను మాత్రం కొనసాగించవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

గురు మూఢమి ఎఫెక్ట్.. ఆ రాశుల వారు ఆస్తిపాస్తుల విషయంలో అలర్ట్..!
Guru Mudhami 2026

Edited By:

Updated on: Jul 16, 2026 | 3:52 PM

ఈ నెల(జూలై) 15 నుంచి ఆగస్టు 12 వరకూ గురు మూఢమి ఏర్పడుతోంది. రవి, గురువులు ఒకే రాశిలో యుతి చెందినప్పుడు గురువు తన కాంతిని కోల్పోవడం వల్ల గురు మూఢమి ఏర్పడుతుంది. గురువు ఆస్తిపాస్తులకు, సొంత ఇంటికి, ధన వృద్ధికి కారకుడైనందువల్ల మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారు ఈ విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇది వరకు చేపట్టిన కార్యక్రమాలను కొనసాగించవచ్చు కానీ, కొత్త కార్యక్రమాలు చేపట్టకపోవడం మంచిది. ఆస్తిపాస్తుల విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకోకూడదు. ఇంటి కొనుగోలు వ్యవహారాన్ని కూడా వాయిదా వేయడం శ్రేయస్కరం.

మేషం

ఆస్తిపాస్తులు, సొంత ఇల్లు, వాహనాలకు సంబంధించిన చతుర్థ స్థానంలో గురు మూఢమి ఏర్పడుతున్నందువల్ల ఈ రాశివారు ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పొర పాటున కూడా ఒప్పందాల మీద సంతకాలు చేయకూడదు. బాగా నష్టపోయే లేదా మోసపోయే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలను ఒక నెల రోజుల పాటు దూరంగా పెట్టడం శ్రేయస్కరం. కొత్తగా సొంత ఇంటి ప్రయత్నాలు చేపట్టకపోవడం మంచిది. ఉద్యోగం మారే ప్రయత్నాలు చేపట్టవద్దు.

వృషభం

తృతీయ స్థానంలో గురు మూఢమి ఏర్పడుతున్నందువల్ల స్థిరాస్తులు, సొంత ఇల్లు, ఫిక్సెడ్ డిపాజిట్లు, ఒప్పందాలకు దూరంగా ఉండడం మంచిది. బాగా సన్నిహితుల వల్ల కూడా మోసపోవడం జరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం శ్రేయస్కరం. ఆస్తి సమస్యలు ముదిరే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో నష్టపోవడం జరుగుతుంది. ఆస్తులు కొనడం, అమ్మడం వంటివి పెట్టుకోవద్దు. సొంత ఇంటితో పాటు వాహన కొనుగోలు ప్రయత్నాలు కూడా ఇబ్బంది పెడతాయి.

ఇవి కూడా చదవండి

సింహం

ఈ రాశికి వ్యయ స్థానంలో మూఢమి ఏర్పడుతున్నందువల్ల ప్రస్తుతానికి గృహ, వాహన ప్రయత్నాలను వాయిదా వేయడం మంచిది. ఏమాత్రం తొందరపడినా చిక్కుల్లో పడే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగం వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆస్తిపాస్తుల మీదే కాక, షేర్లు, స్పెక్యులేషన్ల మీద కూడా పెట్టుబడులు పెట్టవద్దు. ఆస్తిపాస్తుల క్రయ విక్రయాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో నష్టపోవడం, మోసపోవడం వంటివి జరుగుతాయి.

తుల

ఈ రాశికి దశమ స్థానంలో మూఢమి చోటు చేసుకుంటున్నందువల్ల ఒక నెల రోజుల పాటు ఆస్తి పాస్తుల జోలికి, ఆర్థిక వ్యవహారాల జోలికి వెళ్లకపోవడం మంచిది. మోసపోవడానికి బాగా అవ కాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. సొంత ఇంటి ప్రయత్నాల్లో ఊహించని సమస్యలెదురవుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు ప్రతికూలంగా పరిష్కారమవుతాయి. రావలసిన సొమ్ము చేతికి అందకపోవచ్చు.

ధనుస్సు

రాశ్యధిపతి గురువు అష్టమ స్థానంలో రవితో యుతి చెందడం వల్ల ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో తప్ప కుండా మోసపోవడం లేదా నష్టపోవడం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆస్తి వివాదాల పరిష్కార ప్రయత్నాలను ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. కోర్టు కేసులు ప్రతికూల ఫలితాలనిస్తాయి. ఆర్థిక, గృహ ఒప్పందాల మీద సంతకాలు చేయవద్దు. కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి సమయం ఏమాత్రం అనుకూలంగా లేదు. ఆస్తుల క్రయ విక్రయాలు లాభించకపో వచ్చు.

కుంభం

ఈ రాశికి షష్ట స్థానంలో గురు మూఢమి ఏర్పడడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విఫలమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన ప్రయత్నాలు బాగా ఇబ్బందులకు గురి చేస్తాయి. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి కార్యకలాపాలకు దూరంగా ఉండడం మంచిది. సమస్యలను ఎదుర్కోవడం, మోసపోవడం, నష్టపోవడం వంటివి జరుగుతాయి. సొంత ఇంటి ప్రయత్నాలను వాయిదా వేయడం మంచిది. యథాతథ స్థితిని కొనసాగించడం చాలా మంచిది.

Follow Us