Guru Dev: గురు గ్రహ సంచార ప్రభావం.. ఆ రాశుల వారికి ఒడిదుడుకులు..

|

Nov 04, 2023 | 6:47 PM

గురువు బాగుంటే దైవానుగ్రహం ఉన్నట్టే లెక్క. జాతక చక్రంలో గురువు 1,2,5,7,9,11 స్థానాల్లో ఉన్నప్పుడు తప్పకుండా శుభ ఫలితాలనిస్తాడు. 3,4,6,8,10,12 స్థానాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులకు గురి చేస్తాడు. ఇందులో కూడా 6,8,12 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు శకట యోగం పేరుతో కష్టనష్టాలను కలుగజేస్తాడు. ప్రస్తుత గురు సంచారాన్ని బట్టి ఆరు రాశులకు తప్పకుండా కొన్ని ఇబ్బందులుంటాయి.

Guru Dev: గురు గ్రహ సంచార ప్రభావం.. ఆ రాశుల వారికి ఒడిదుడుకులు..
Guru dev effects
Follow us on

జ్యోతిషశాస్త్రంలో గురు గ్రహానికి ఒక విశిష్టత ఉంది. జాతక చక్రంలో ఈ గ్రహం సానుకూలంగా ఉన్న పక్షంలో ఆ జాతకుడికి తిరుగుండదు. జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. గురు గ్రహం నీచబడినా, దుస్థానాల్లో ఉన్నా జీవితంలో ఒడిదుడుకులు తప్పవు. గురువు బాగుంటే దైవానుగ్రహం ఉన్నట్టే లెక్క. జాతక చక్రంలో గురువు 1,2,5,7,9,11 స్థానాల్లో ఉన్నప్పుడు తప్పకుండా శుభ ఫలితాలనిస్తాడు. 3,4,6,8,10,12 స్థానాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులకు గురి చేస్తాడు. ఇందులో కూడా 6,8,12 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు శకట యోగం పేరుతో కష్టనష్టాలను కలుగజేస్తాడు. ప్రస్తుత గురు సంచారాన్ని బట్టి ఆరు రాశులకు తప్పకుండా కొన్ని ఇబ్బందులుంటాయి. జీవితం అంత ఈజీగా సాగిపోయే అవకాశం ఉండదు. ప్రతి పనిలోనూ ఏదో ఒక సమస్య ఉంటుంది. ఏప్రిల్ 24 వరకూ గురు గ్రహం మేషంలో సంచరిస్తున్నందువల్ల మరో అయిదారు నెలల పాటు ఆరు రాశుల వారికి కష్టాలు తప్పవు. అవిః వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం.

వృషభం: ఈ రాశికి 12వ స్థానంలో గురు సంచారం వల్ల ‘శకట యోగం’ అనే కష్టనష్టాల యోగం ఏర్పడింది. గురువు మినహా ఇతర గ్రహాల అనుకూలత ఉంటే తప్ప ఈ రాశివారికి జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోయే అవకాశం ఉండదు. ఈ రాశివారికి 12వ స్థానంలో గురువు సంచారం జరుగుతున్నంత కాలం చేతిలో డబ్బు నిలవదు. ఏదో ఒక రూపంలో కష్టార్జితం వృథా అవుతూ ఉంటుంది. ఎవరు ఎప్పుడు ప్రతికూలంగా మారుతారో తెలియదు. అనుకూలంగా ఉన్న పరిస్థితులు హఠాత్తుగా ప్రతికూలంగా మారిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

కర్కాటకం: ఈ రాశికి దశమ స్థానంలో గురువు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి నత్తనడ కగా సాగుతుంది. ఉద్యోగ స్థానంలో ఎవరో ఒకరు కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఉంటారు. వృత్తి, వ్యాపారాల్లో పోటాదార్ల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. జీవితం గతుకుల రోడ్డు మీద బండిలా సాగు తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విఘ్నాలు తప్పకుండా ఉంటాయి. అటు అధికారులు, ఇటు సహోద్యోగులు సమస్యలు సృష్టించే అవకాశం ఉంటుంది. కిందివారికి ప్రమోషన్ వస్తుంది కానీ, ఈ రాశివారికి ఒక పట్టాన గుర్తింపు లభించదు. ఉద్యోగం మారే ప్రయత్నాలు కూడా అనుకూలించవు.

కన్య: ఈ రాశివారికి అష్టమ స్థానంలో గురు సంచారం వల్ల శకట యోగం ఏర్పడింది. ఆర్థిక సమస్యలు ఎక్కువగా చుట్టుముట్టే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు ఒక పట్టాన కలిసి రావు. పని చేయిం చుకుని డబ్బు ఎగ్గొట్టే వ్యవహారాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. ప్రతిఫలం తక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో జీతభత్యాలు గానీ, రాబడి గానీ ఆశించిన స్థాయిలో పెరగకపోవచ్చు. సతీమణితో అపార్థాలు, లేనిపోని సమస్యలు తలెత్తవచ్చు. కుటుంబ వ్యవహారాలు ఆందోళన కలిగిస్తాయి. బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

వృశ్చికం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో గురు సంచారం వల్ల శకట యోగం ఏర్పడింది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి కాకపోవచ్చు. మాట నిలబెట్టుకోవడం సాధ్యం కాకపోవచ్చు. ఇతరులకు డబ్బు ఇచ్చి ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల కారణంగా డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. మీరు ఇవ్వాల్సిన డబ్బుకు ఒత్తిడి ఉంటుంది. మీకు డబ్బు ఇవ్వా ల్సిన వారు తప్పించుకు తిరుగుతారు. ఎవరికీ హామీలు ఉండడం, వాగ్దానాలు చేయడం మంచిది కాదు. ఆర్థిక లావాదేవీలు కలిసి రావు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి.

మకరం: ఈ రాశివారికి నాలుగవ స్థానంలో గురు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రావలసిన గుర్తింపు లభించకపోవచ్చు. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించదు. ఎటువంటి ఆర్థిక ప్రయోజనమూ లేకుండా పని భారం, బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది. మానసిక, శారీరక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. గృహ, వాహన సౌకర్యాల విషయంలో ఏ ప్రయత్నమూ ఒక పట్టాన ముందుకు సాగదు. కుటుంబపరమైన చికాకులు ఉంటాయి. ఆస్తి వివాదం తేలదు. ప్రయాణాల వల్ల ఆర్థిక నష్టం తప్ప ఒరిగేదేమీ ఉండదు. మధ్య మధ్య ఆరోగ్యం ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

కుంభం: ఈ రాశివారికి మూడింట గురు సంచారం వల్ల ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు ముందుకు సాగవు. ఆటంకాలు, అవరోధాలు ఎక్కువగా ఉంటాయి. ఆశించిన స్థాయిలో పురోగతి ఉండదు. ప్రతిభా పాటవాలున్నా ప్రకాశించవు. వృత్తి, ఉద్యోగాల్లో తరచూ అవమానాలు, అనుమానాలు తప్పకపోవచ్చు. అధికారులను సంతృప్తిపరచడం చాలా కష్టమవుతుంది. వ్యాపారాల్లో చట్టపర మైన సమస్యలు ఎదురు కావచ్చు. ప్రయాణాల్లో విలువైన వస్తువులు లేదా పత్రాలు పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఇబ్బంది పెడతాయి. సోదరులతో సఖ్యత తగ్గు తుంది.

ముఖ్యమైన పరిహారాలు: గురు సంచారంలో దోషాలున్నప్పటికీ, ఇతర గ్రహాల అనుకూలత వల్ల సమస్యల తీవ్రత తగ్గే అవ కాశం ఉంటుంది. ముఖ్యంగా గురువుతో సమానంగా మంచి ఫలితాలనిచ్చే శుక్ర గ్రహం అను కూలంగా ఉన్నపక్షంలో గురువు తాలూకు దుష్ప్రభావం బాగా తగ్గుతుంది. గురు గ్రహం అను కూలంగా లేనప్పుడు, ఈ గ్రహం వల్ల కష్టనష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు సుందరకాండ పారా యణం చేయడం, విష్ణు సహస్ర నామం పఠించడం లేదా దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల ఇవన్నీ చాలావరకు తగ్గుముఖం పడతాయి. పుష్యరాగం అనే రత్నాన్ని ఉంగరంలో పొదిగి, ధరించడం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. తెలుపు, గోధుమ రంగు దుస్తులు ధరించడం వల్ల కూడా గురు సంచార దుష్ప్రభావం బాగా తగ్గుతుంది.

(Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..