August Astrology: అబ్బా.. ఆగస్టులో ఈ రాసుల వారికి అదృష్టం పడిశం పట్టినట్లు పట్టనుంది.. ఏది పట్టినా బంగారమే

గురు గ్రహం ఆగస్టులో రెండు సార్లు తన నక్షత్ర స్థానాన్ని మార్చనుంది. దీనివల్ల మేషం, కర్కాటకం, మీనం రాశుల వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబంగా అనేక శుభ పరిణామాలు ఎదురవే అవకాశం ఉంది. ఈ మార్పుల ప్రభావం మీ రాశిపై ఎలా ఉంటుందో తెలుసుకోండి.

August Astrology: అబ్బా.. ఆగస్టులో ఈ రాసుల వారికి అదృష్టం పడిశం పట్టినట్లు పట్టనుంది.. ఏది పట్టినా బంగారమే
August Astrology

Updated on: Jul 30, 2025 | 7:49 PM

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం… 2025 ఆగస్టు నెల ఎంతో విశేషమైనదిగా కనిపిస్తుంది. ఈ నెలలో బృహస్పతి (గురుడు) సహా పలు కీలక గ్రహాలు తమ స్థానం మారనున్నాయి. నవగ్రహాలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన గురుడు మారే స్థానాల ప్రభావం ప్రతి రాశి జీవితంపై స్పష్టంగా కనిపిస్తుంది. గురు బలంగా ఉన్న జాతకాలకు విజయం, వివాహ యోగం, సంతాన సుఖం లభించడమన్నవి సాధారణం.

ఈ ఆగస్టులో గురుడు రెండు సార్లు తన నక్షత్రాన్ని మార్చనున్నాడు. ఆగస్టు 13, ఉదయం 5:44 గంటలకు పునర్వసు నక్షత్రం మొదటి పాదంలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 30 తర్వాత పునర్వసు రెండో పాదంలోకి మారతాడు. ఈ నెల మొత్తం గురుడు మిథున రాశిలోనే సంచరిస్తాడు. తన రాశిలో సంచరించడు. ఈ మార్పుల ప్రభావంతో మేష, కర్కాటక, మీన రాశులకు విశేష ఫలితాలు లభించే అవకాశముంది.

మేష రాశి: గురువు స్థానం మారడం వల్ల ఆర్థికంగా స్థిరత వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్, జీతాల పెంపు, ఉద్యోగ మార్పు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యం మెరుగవుతుంది, ఖర్చులు తగ్గుతాయి. వ్యాపారులకు లాభదాయకమైన డీల్స్ కుదురుతాయి.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి కుటుంబంలో సుఖశాంతి, బంధువులతో వివాదాలు పరిష్కారం, ఆరోగ్యపరంగా ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి. సీజనల్ ఇన్ఫెక్షన్లు తప్ప, పెద్దగా ఆరోగ్య సమస్యలు కనిపించవు.

మీన రాశి: మీ రాశిపతి గురుడు స్థానం మారడం వల్ల రెండింతల లాభాలు చేకూరే అవకాశముంది. పార్టనర్‌షిప్ వ్యాపారాల్లో పెద్ద విజయం సాధించవచ్చు. కొత్త బిజినెస్ సంబంధాలు లాభాల దారితీస్తాయి. ఆర్థికంగా భారం తగ్గుతుంది. బంధుత్వాలు మెరుగవుతాయి. ప్రియమైన వ్యక్తులతో సమయం గడిపే అవకాశం ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది.