Gajakesari Yoga
ఈ నెల 3,4 తేదీల్లో వృషభ రాశిలో గురు, చంద్రుల యుతి చోటు చేసుకుంటోంది. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఒక అరుదైన గజకేసరి యోగం ఏర్పడుతోంది. సాధారణంగా చంద్రుడికి ఉచ్ఛ రాశి అయిన వృషభంలో గురువు 12 ఏళ్లకొకసారి సంచారం చేయడం జరుగుతుంది. అందువల్ల ఈ గజకేసరి యోగం మళ్లీ 12 ఏళ్లకు గానీ ఏర్పడే అవకాశం ఉండదు. గజకేసరి యోగం పట్టిన ఈ రెండు రోజుల్లో ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి, శుభ కార్యాలు తలపెట్టడానికి ఇది చాలా మంచి సమయం. ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ప్రస్తుతం ఈ యుతి వల్ల మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారు అత్యధికంగా ప్రయోజనం పొందబోతున్నారు.
- మేషం: ఈ రాశికి ధన స్థానంలో గురు, చంద్రులు కలుస్తున్నందువల్ల ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు పెరు గుతాయి. అనారోగ్యాల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. మాతృమూలక ధన లాభం ఉంటుంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. అధికారులకు మీ మీద నమ్మకం పెరుగు తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్లే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి.
- వృషభం: ఈ రాశిలో గురు, చంద్రులు కలుస్తున్నందువల్ల, ఇందులో చంద్రుడికి ఉచ్ఛ పట్టడం వల్ల ఈ సమయంలో చేపట్టే ప్రయత్నాలు, తీసుకునే నిర్ణయాలు తప్పకుండా ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఒక సెలబ్రిటీగా గుర్తింపు పొందడం కూడా జరుగుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంట్లో శుభకార్యాలకు ప్లాన్ చేస్తారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆశించిన శుభవార్తలు వినడం జరుగుతుంది.
- కర్కాటకం: ఈ రాశికి అధిపతి అయిన చంద్రుడు లాభ స్థానంలో ఉచ్ఛపట్టడం, పైగా భాగ్యాధిపతి గురువుతో కలవడం వల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభానికి, ఆకస్మిక అధికార యోగానికి అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రభుత్వం ద్వారా గుర్తింపు లభిస్తుంది. ఆదా యం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. అనారోగ్యాల నుంచి చాలావరకు ఉపశమనం లభి స్తుంది. నిరుద్యోగులు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.
- కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో ఈ గజకేసరి యోగం ఏర్పడినందువల్ల విదేశీమూలక ధన లాభం కలు గుతుంది. విదేశాల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలు, సమస్యలు తొలగిపోతాయి. సంపన్నుల కుటుంబంతో మంచి పెళ్లి సంబంధం కుదురు తుంది. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. పిత్రార్జితం కలిసి వస్తుంది. తీర్థయాత్రలు, విహార యాత్రలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి.
- వృశ్చికం: ఈ రాశికి సప్తమ రాశిలో గురు చంద్రుల కలయిక ఏర్పడినందువల్ల జీవనశైలి ఒక్కసారిగా మారి పోయే అవకాశం ఉంటుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. అనేక విధాలుగా సంపద పెరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. గృహ, వాహన యోగాలు పట్టే సూచనలున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. తల్లితండ్రులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ముందుకు సాగుతుంది.
- మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడుతున్నందువల్ల గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు బాగా విస్తరిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు లభిస్తాయి. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. పిల్లలు ఘన విజయాలు సాధి స్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.