Gajakesari Yogam: ఈ నాలుగు రాశుల వారికి త్వరలో గజకేసరి యోగం.. దీని విశిష్టత ఏమిటో తెలుసుకోండి..!

ఆర్థికంగా అనూహ్యమైన పురోగతి సాధించడం, పేరు ప్రఖ్యాతులు సంపాదించడం ఈ గజకేసరి యోగం ప్రధాన లక్షణాలు. ఈ ఏడాది ఏప్రిల్ 23 తర్వాత నుంచి ఈ నాలుగు రాశులకు ఈ యోగం ఏర్పడుతుంది. 

Gajakesari Yogam: ఈ నాలుగు రాశుల వారికి త్వరలో గజకేసరి యోగం.. దీని విశిష్టత ఏమిటో తెలుసుకోండి..!
Gajakesari Yoga
Image Credit source: TV9 Telugu

Edited By: Janardhan Veluru

Updated on: Feb 24, 2023 | 4:26 PM

జ్యోతిష్య శాస్త్రంలో గజకేసరి యోగానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. చంద్రగ్రహానికి ఒకటి, నాలుగు, ఏడు, పదవ స్థానాల్లో గురు గ్రహం సంచరిస్తున్నప్పుడు ఈ మహాయోగం ఏర్పడుతుంది. ఆర్థికంగా అనూహ్యమైన పురోగతి సాధించడం, పేరు ప్రఖ్యాతులు సంపాదించడం ఈ గజకేసరి యోగం ప్రధాన లక్షణాలు. ఈ ఏడాది ఏప్రిల్ 23 తర్వాత నుంచి మేషం, కర్కాటకం తుల మకర రాశులకు ఈ యోగం ఏర్పడుతుంది.

మేష రాశి

ఈ రాశి వారికి ఏప్రిల్ 23 తర్వాత ఈ గజకేసరి యోగం పట్టబోతోంది. దీనివల్ల ఈ రాశి వారికి ఆర్థికంగా ఊహించనంతగా ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ఏడాది ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఆస్తి సంబంధమైన కోర్టు కేసుల్లో విజయం ఈ రాశి వారిని వరిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో సంపాదన ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది. చదువుల్లో సునాయాసంగా రాణిస్తారు. ఉన్నత స్థాయి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. ఈ రాశి వారికి మే నెల నుంచి అక్టోబర్ వరకు కీలక సమయం.

కర్కాటక రాశి

ఈ రాశి వారికి గజకేసరి యోగం కారణంగా అపారమైన ధనయోగం పట్టబోతోంది. పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది. వృత్తి వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. విదేశాలలో స్థిరపడే సూచనలు ఉన్నాయి. రాజకీయ నాయ కులు ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. మంచి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదిరే అవ కాశం ఉంది. అతి ముఖ్యమైన శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి చాలా వరకు కోలుకునే సూచనలు ఉన్నాయి.

తులా రాశి

ఈ రాశి వారికి మనసులోని అతి ముఖ్యమైన ఒకటి రెండు కోరికలు నెరవేరటం జరుగుతుంది. గజకేసరి యోగం వల్ల సంపన్నుల కుటుంబంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు పెళ్ళికి దారితీస్తాయి. సంతానం  వృద్ధిలోకి వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కాంటాక్ట్స్ పెరుగుతాయి. ప్రతిష్టాత్మక సంస్థలో భారీ జీతభత్యాలతో ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాల పంట పండుతుంది. ఇవన్నీ మే మొదటి వారం నుంచి వర్తించడం ప్రారంభం అవుతుంది.

మకర రాశి

ఈ రాశి వారికి ఏప్రిల్ 23 నుంచి పట్టబోయే గజకేసరి యోగం వల్ల సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల వల్ల అత్యధికంగా ప్రయోజనం పొందే సూచనలు ఉన్నాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. ఒక పెద్ద సంస్థలో అధికారం చేపట్టడం జరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు చేపట్టడం జరుగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిణామాలన్నీ ఏప్రిల్ చివరి వారం నుంచి చోటు చేసుకుంటాయి.