AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Evil Eye: ఈ రాశుల వారికి నరదిష్టి ఎక్కువ.. ఏ రాశి వారు ఎలాంటి పరిహారం పాటించాలో తెలుసా?

మన నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లలో దుష్టశక్తుల ప్రభావం ఒకటి. కొన్నిసార్లు మనం చేసే పనులు ఆగిపోవడం లేదా అనారోగ్య సమస్యలు వెంటాడటం వెనుక దిష్టి దోషం" కారణం కావచ్చు అని నమ్ముతారు. అయితే, ఈ ప్రతికూల ప్రభావాల నుంచి బయటపడటానికి జ్యోతిష్యశాస్త్రం కొన్ని పరిష్కార మార్గాలను సూచిస్తుంది. మీ రాశిచక్రం ప్రకారం దుష్టశక్తుల నుంచి ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Evil Eye: ఈ రాశుల వారికి నరదిష్టి ఎక్కువ.. ఏ రాశి వారు ఎలాంటి పరిహారం పాటించాలో తెలుసా?
Evil Eye Remedies Zodiac Sign
Bhavani
|

Updated on: Jun 30, 2025 | 10:25 AM

Share

జ్యోతిష్య నిపుణులు దుష్టశక్తుల ప్రభావం నుంచి తప్పించుకోవడానికి ప్రతి రాశివారు చేయాల్సిన పనులను వివరించారు. ఈ సూచనలు పాటించడం ద్వారా దిష్టి దోషం లాంటి వాటి నుంచి విముక్తి పొందవచ్చని అంటున్నారు. మరి ఏ రాశి వారు ఎలాంటి పరిహారం చేయాలి.. అందుకు జ్యోతిష్య నిపుణులు చెప్తున్న సూచనలేంటో తెలుసుకుందాం..

మేషం: ఐదు ఎండుమిర్చి తీసుకోండి. వాటిని తల చుట్టూ ఏడుసార్లు తిప్పి కర్పూరంతో కాల్చండి.

వృషభం: ఐదు లవంగాలు తీసుకుని, వాటిని తల చుట్టూ ఏడుసార్లు తిప్పిన తర్వాత ఇంటి బయట పడేయండి.

మిథునం: వేప ఆకులు తీసుకుని, వాటిని తల చుట్టూ ఏడుసార్లు తిప్పి, మట్టి కుండలో కర్పూరంతో పాటు కాల్చండి.

కర్కాటకం: చంద్రుడి ప్రభావంలో ఉండే కర్కాటక రాశివారికి దిష్టి త్వరగా తగులుతుంది. కాబట్టి ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ప్రతిరోజూ ఉప్పు నీటితో స్నానం చేయాలి.

సింహం: రెండు లవంగాలు, రెండు ఎండుమిర్చి తీసుకోండి. వాటిని తల చుట్టూ అపసవ్య దిశలో ఏడుసార్లు తిప్పి, కర్పూరంతో కాల్చండి.

కన్య: మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించడం ద్వారా దుష్టశక్తుల ప్రభావం నుంచి విముక్తి పొందవచ్చు.

తుల: తుల రాశి వారికి బలమైన ఆరా(aura) ఉన్నా, వారు దుష్టశక్తుల నుంచి రక్షించే బ్రాస్‌లెట్ ధరించవచ్చు. పౌర్ణమి, ప్రదోష దినం లాంటి ప్రత్యేక సందర్భాలలో దాన్ని శుభ్రం చేసుకోవాలి.

వృశ్చికం: కొబ్బరికాయను నీటితో నింపి, దాన్ని తల చుట్టూ ఏడుసార్లు తిప్పి, ప్రవహించే నీటిలో పడేయండి.

ధనుస్సు, మీనం: ఈ రెండు రాశులను గురు గ్రహం పాలిస్తుంది. కాబట్టి నెలకోసారి గంగా నదిలో పుణ్యస్నానం చేయాలి.

మకరం: ఎడమ కాలికి నల్ల దారం కట్టుకోవాలి.

కుంభం: ప్రతిరోజూ నిమ్మకాయను తమ పర్సులో లేదా జేబులో ఉంచుకోండి. సాయంత్రం దాన్ని బయట పడేయండి. ఈ పనిని ప్రతిరోజూ లేదా ప్రత్యేక సందర్భాలలో చేయవచ్చు.

గమనిక: పైన అందించిన సమాచారం జ్యోతిష్యశాస్త్ర ఆధారితమైనది. దీనిని వ్యక్తిగత నమ్మకాలు, విశ్వాసాల మేరకే పరిగణించాలి. ఏదైనా తీవ్రమైన సమస్యలు, ఆరోగ్యపరమైన విషయాలకు నిపుణులను సంప్రదించడం ఉత్తమం.