జూన్ 24 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు!

Horoscope Today (June 24, 2026): బుధవారం దినఫలాల ప్రకారం మేష రాశి వారికి ఉద్యోగ, ఆదాయ విషయాల్లో శుభవార్తలు అందే అవకాశం ఉంది. వృషభ రాశి వారు పెరిగిన ఆదాయంతో పాటు అధిక ఖర్చులను ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. మిథున రాశి వారికి వృత్తి, ఆర్థిక రంగాల్లో పురోగతితో పాటు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందే అవకాశం ఉంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ రోజు గ్రహస్థితి ఎలా ప్రభావం చూపనుందో తెలుసుకోండి.

జూన్ 24 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు!
Horoscope Today 24 June 2026

Edited By:

Updated on: Jun 24, 2026 | 6:00 AM

దిన ఫలాలు (జూన్ 24, 2026): మేష రాశి వారి కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన సానుకూల స్పందన లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఆదాయం పెరిగినా అంతకు మించి ఖర్చులుంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. మిథున రాశి వారికి వృత్తి జీవితంలో ఆర్థిక పురోగతి ఉంటుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. కొన్ని ప్రత్యేక బాధ్యతల్ని అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పురోగమిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఇష్టమైన మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన సానుకూల స్పందన లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఇంటా బయటా ఒత్తిడి బాగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు సంబంధించిన బాధ్యతల్ని నిర్వర్తించాల్సి వస్తుంది. ఆదాయం పెరిగినా అంతకు మించి ఖర్చులుంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ మీద స్థాన చలనానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితులు ఏర్పడతాయి. ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగుతుంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ఉద్యోగంలో సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. వాహన సౌకర్యం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి జీవితంలో ఆర్థిక పురోగతి ఉంటుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. ఆరోగ్యానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, వ్యాపారాల్లో మీ ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ, ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశజనకంగా, అనుకూలంగా ఉంటుంది. ఒకటి రెండు అదనపు ఆదాయ మార్గాల నుంచి ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ప్రయాణాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆర్థిక పురోగతి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. శుభ కార్యాలకు సంబంధించి బంధువుల నుంచి ఆహ్వానాలు అందు తాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు మేలు చేసే పనులు చేస్తారు. కొందరు మిత్రుల విమర్శల్ని పట్టించుకోకపోవడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాలు బిజీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ఒకటి రెండు సమస్యలు ఎదురవుతాయి. ఆదాయం, ఆరోగ్యం సజావుగా సాగిపోతాయి. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. అవసరాలకు తగ్గట్టుగా డబ్బు అందుతుంది. మొండి బాకీ ఒకటి వసూలవుతుంది. కుటుంబంలో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రయాణాలను వాయిదా వేయడం శ్రేయస్కరం. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయకపోవడం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారు అంచనాలకు మించి సంపాదిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. బంధువుల నుంచి శుభ వార్తలు అందుతాయి. పెండింగ్ పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆదాయం, ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా వేగం పెరుగుతుంది. తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. పదోన్నతులకు ఆస్కారం ఉంది. అవసరానికి ధనం వసూలవుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుతారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పరవాలేదు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఒకటి రెండు ఆర్థిక, కుటుంబ సమస్యలను చక్కబెట్టడం జరుగుతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. మిత్రుల నుంచి ఒత్తిడి ఉంటుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

రోజంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపా రాలు నిలకడగా పురోగమిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. కొందరు ఇష్టమైన స్నేహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ఇంటా బయటా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాల్లో స్వల్పంగా లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. వ్యక్తిగత వ్యవహారాల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త పనుల్ని చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక కార్యకలాపాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబపరంగా ఆశించిన సహకారం లభిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొను గోలు చేస్తారు. ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యం తలపెడతారు. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. కొందరు బంధుమిత్రులతో విహార యాత్ర చేస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఆరోగ్యం పరవాలేదు. ఎవరికీ హామీలు ఉండవద్దు.

Follow Us