
దిన ఫలాలు (జూలై 9, 2026): మేష రాశి వారు ఈ రోజు వృత్తి, ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో ఉన్న ముఖ్యమైన సమస్యల్ని అధిగమిస్తారు. వృషభ రాశి వారు ఆస్తి వివాదాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. మిథున రాశికి చెందిన నిరుద్యోగులు తమ ప్రయత్నాల్లో ఆశించిన వార్తలు వింటారు. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసివస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
వృత్తి, ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో ఉన్న ముఖ్యమైన సమస్యల్ని అధిగమిస్తారు. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. అన్నదమ్ములతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యల్ని తెలివిగా పరిష్కరించుకుంటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది.
వృత్తి, ఉద్యోగాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. వ్యాపారాల పరిస్థితి నిలకడగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఆస్తి వివాదాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. కుటుంబ సభ్యు లతో వీలైనంత సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది.
వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపడతారు. శుభ పరిమాణాలు చోటు చేసుకుంటాయి. చిన్ననాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆశించిన సమాచారం అందుతుంది. ముఖ్యమైన పనుల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉంటుంది. నిరుద్యోగులు తమ ప్రయత్నాల్లో ఆశించిన వార్తలు వింటారు. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసివస్తాయి. దాంపత్య జీవితం హ్యాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం అనుకూలంగాఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి ఒత్తిడి ఉన్నప్పటికీ ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. బంధువుల నుంచి ఆశించిన శుభ వార్త వింటారు. కొందరు మిత్రుల వల్ల ఆర్థిక నష్టానికి అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది.
ఉద్యోగంలో ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. అధికారులు బాధ్యతల్ని పెంచే సూచనలున్నాయి. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. కొందరు ఇష్టమైన స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం కనిపిస్తోంది. కుటుంబంలో చిన్నా చితకా సమస్యలు సర్దుమణుగుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.
ఆర్థికాభివృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపి స్తాయి. వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. ఉద్యో గంలో అధికారులకు నమ్మకం ఏర్పడి ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్థిక ప్రయత్నాలు అంచ నాలకు మించి సత్ఫలితాలనిస్తాయి. మిత్రుల సాయంతో ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని శుభవార్తలు వింటారు. వృత్తి జీవితం విస్తరించడానికి, పురోగతి చెంద డానికి అవకాశం ఉంది. వ్యాపారాలను కొత్త పుంతలు తొక్కిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందు తుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ప్రయాణాల వల్ల లాభముంటుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు బాగా పెరుగుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక సమస్యల ఒత్తిడి చాలావరకు తగ్గిపోతుంది. గృహ, వాహన ప్రయత్నాలు చేపడతారు. శత్రువులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. కొందరు శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి నుంచి సహాయం అందు తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల, సామరస్య వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగి పోతాయి. బాగా దగ్గర బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే అవకాశముంది. మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబపరంగా శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. రావాల్సిన సొమ్ము అనుకోకుండా చేతికి అందుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నా, చేపట్టిన పనుల్ని తేలికగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి.
ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. భద్రతకు, స్థిరత్వానికి లోటుం డదు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వృత్తి రంగంలో కొద్దిగా శ్రమాధి క్యత ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. వ్యక్తిగత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పరవాలేదు.
వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి.వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసు కుంటారు. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతమయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ పరిస్థితి చక్కబడుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారాల్లో లాభసాటి ఒప్పందాలు కుదురు తాయి. స్వల్పంగా అనారోగ్య సమస్యలున్నా కోలుకుంటారు. ఆదాయం పరవాలేదనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది. నిరుద్యోగులకు అనుకోకుండా మంచి ఆఫర్ అందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి.
Also Read: ఆ రాశుల వారికి కొత్త ఉద్యోగ ఆఫర్లు, ప్రమోషన్లు పక్కా..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న జ్యోతిష్య సమాచారం గ్రహాల సంచారాలు, పంచాంగం, సంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా అందించబడింది. ఇవి వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించిన అంశాలు మాత్రమే. జాతక ఫలితాలు వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాలు, ఇతర జ్యోతిష్య అంశాల ఆధారంగా మారవచ్చు. దీనిని ఖచ్చితమైన ఫలితంగా పరిగణించకుండా సాధారణ సమాచారంగా మాత్రమే భావించాలి.