AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మన టైమ్ మొదలవుతుంది భయ్యా.. వారికి కొత్త ఉద్యోగ ఆఫర్లు, ప్రమోషన్లు పక్కా..!

Career Astrology: జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు కొనసాగే గురు మూఢమి కారణంగా శుభకార్యాలకు అనుకూలత తగ్గినప్పటికీ, కెరీర్, ఉద్యోగ పరంగా మాత్రం కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ముఖ్యంగా మేషం, వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారు గురు మూఢమికి ముందు ప్రారంభించిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగం, పదోన్నతి, ఆదాయం, వృత్తి పురోగతిలో అనుకూల మార్పులను చూసే అవకాశం ఉంది.

మన టైమ్ మొదలవుతుంది భయ్యా.. వారికి కొత్త ఉద్యోగ ఆఫర్లు, ప్రమోషన్లు పక్కా..!
Guru Moodhami 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 08, 2026 | 6:13 PM

Share

జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు గురు మౌఢ్యం లేదా గురు మూఢమి (Guru Moodhami 2026) ఏర్పడుతోంది. సూర్యుడు గురు గ్రహానికి అత్యంత సమీపంగా వచ్చినప్పుడు గురువు బలహీనపడడం లేదా తన కాంతిని కోల్పోవడం జరుగుతుంది. దీన్నే గురు మూఢమి అని అంటారు. సాధారణంగా ఈ గురు మూఢమి సమయంలో శుభకార్యాలు చేయరు. అయితే, గురు, రవులు కలవడమనేది కెరీర్ పరంగా శుభ ఫలితాలను ఎక్కువగా ఇస్తుంది. గురు మూఢమికి ముందు చేపట్టిన ప్రయత్నాలు, కార్యక్రమాలు తప్పకుండా సక్సెస్ అవుతాయి. ముఖ్యంగా మేషం, వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి కెరీర్ మంచి మలుపు తిరుగుతుంది.

  1. మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో గురు, రవులు కలవడమనేది యోగదాయకమే అవుతుంది తప్ప ఏ విధంగానూ నష్టం కలిగించదు. ప్రధానంగా ఆర్థికాభివృద్ధికి ఈ మూఢమి బాగా దోహదం చేస్తుంది. వృత్తి, వ్యాపారాలకు రాబడిపరంగా తిరుగుండదు. ఉద్యోగంలో అనేక రకాలుగా ఆదాయం పెరుగుతుంది. ఏ రంగంలో ఉన్నవారికైనా ఆర్థికంగా బలం ఏర్పడి, జీవితం సుఖసంతోషాలతో సాగి పోతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతయి. సంపద, సౌభాగ్యాలు వృద్ధి చెందుతాయి.
  2. వృషభం: చతుర్థ స్థానంలో గురు, రవులు కలవడం వల్ల ఈ రాశివారికి పోటాపోటీగా అదృష్టాలు కలుగుతాయి. ఈ రెండు శుభ గ్రహాలు కలవడం వల్ల వీరికి ధన యోగాలతో కూడిన రాజయోగం పడుతుంది. తప్పకుండా పదోన్నతి కలుగుతుంది. ఎటువంటి ఆర్థిక ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ఆర్థిక వ్యాపారం చేసే వారికి బాగా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా ప్రాధాన్యం పెరు గుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.
  3. కర్కాటకం: ఈ రాశిలో గురు, రవులు కలుస్తున్నందువల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థిక సంబంధమైన కష్టనష్టాలు మటుమాయం అవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో పాటు ఆశించిన పదోన్నతి రావడానికి అవకాశ ముంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు గడించడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. వారసత్వ సంపద సమకూరుతుంది.
  4. కన్య: ఈ రాశికి లాభ స్థానంలో గురు, రవి గ్రహాలు కలుస్తున్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. కలలో కూడా ఊహించని అదృష్టం పట్టే అవకాశముంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది.. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. నిరుద్యోగులకు విదేశీ అఫర్లు అంది వస్తాయి. అనారోగ్యాల నుంచి ఊరట లభిస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. తుల: ఈ రాశికి దశమ స్థానంలో గురు, రవుల కలయిక వల్ల నెల రోజుల పాటు యోగదాయకంగా సాగిపోతుంది. ఒకటికి రెండు ధన యోగాలు కలుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సాధారణ స్థితి నుంచి ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. ఉద్యోగ స్థిరత్వానికి, ఆర్థిక స్థిరత్వానికి అవకాశముంది. పలువురితో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది.
  7. మకరం: గురు మూఢమిలో శుభ కార్యాలకు అవకాశం లేనప్పటికీ ఈ రాశివారికి మాత్రం ఇది యోగదాయక కాలం అవుతుంది. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. సిరిసంపదలు బాగా వృద్ధి చెందుతాయి. ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ జీవితం పదోన్నతులు, భారీ జీత భత్యాలతో కొత్త పుంతలు తొక్కుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి మంచి ఆఫర్లు అందుతాయి.

Also Read: ఆషాఢంలో ఈ రాశుల వారికి అదృష్ట పంట ఖాయం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న జ్యోతిష్య సమాచారం గ్రహాల సంచారాలు, పంచాంగం, సంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా అందించబడింది. ఇవి వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించిన అంశాలు మాత్రమే. జాతక ఫలితాలు వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాలు, ఇతర జ్యోతిష్య అంశాల ఆధారంగా మారవచ్చు. దీనిని ఖచ్చితమైన ఫలితంగా పరిగణించకుండా సాధారణ సమాచారంగా మాత్రమే భావించాలి.

Follow Us
OTTలో దుమ్మురేపుతోన్న మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTTలో దుమ్మురేపుతోన్న మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
మాజీ ప్రేమికుల కోసం స్పెషల్ లవ్ మార్కెట్.. ఏడాదికోసారి కలుసుకునే
మాజీ ప్రేమికుల కోసం స్పెషల్ లవ్ మార్కెట్.. ఏడాదికోసారి కలుసుకునే
ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ప్లాట్‌ఫామ్‌పై కేంద్ర విద్యాశాఖ సమీక్ష..
ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ప్లాట్‌ఫామ్‌పై కేంద్ర విద్యాశాఖ సమీక్ష..
2027లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ సంచలనం
2027లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ సంచలనం
తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్ తెచ్చేస్తున్న బోట్‌ లూనార్ డిస్కవరీ..
తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్ తెచ్చేస్తున్న బోట్‌ లూనార్ డిస్కవరీ..
గుడ్‌న్యూస్‌.. ఐఫోన్ 17 ప్రోపై రూ.39,000 తగ్గింపు.. బెస్ట్‌ డీల్‌
గుడ్‌న్యూస్‌.. ఐఫోన్ 17 ప్రోపై రూ.39,000 తగ్గింపు.. బెస్ట్‌ డీల్‌
దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..
దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..
బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో
బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో
బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?
బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?
ఏఐ రంగంలో మెటా, గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నది ఇవే
ఏఐ రంగంలో మెటా, గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నది ఇవే
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర