AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు..

Today Horoscope in Telugu (June 7, 2026): మేష రాశి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలిసిరాగా, వృషభ రాశి వారికి వృత్తి జీవితంలో గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి. మిథున రాశి వారు కొత్త ప్రయత్నాల్లో విజయాన్ని అందుకుంటారు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి మంగళవారం ఎలా ఉండబోతోందో తెలుసుకోండి.

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు..
Rashi Phalalu 07 July 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 07, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (జూలై 7, 2026): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఈ రోజు ఉద్యోగ యోగం పడుతుంది. ఉద్యోగంలో మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. వృషభ రాశి వారికి వృత్తి జీవితంలో మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మిథున రాశి వారు కొత్త ప్రయత్నాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. డాక్టర్లకు, లాయర్లకు, ఇతర వృత్తు లవారికి బాగా డిమాండ్ ఏర్పడుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. సోదరులతో సమస్యలు పరిష‌్కరించుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహపరుస్తాయి. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కాస్తంత ఆందోళన కలిగిస్తుంది. కొందరు చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. కొత్త బాధ్యతల్ని చేపడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. సమాజంలో మాట చెల్లుబాటవుతుంది. కొత్త ప్రయత్నాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. జీవిత భాగస్వామితో అన్యో న్యత వృద్ధి చెందుతుంది. చదువుల్లో పిల్లలు పురోగతి సాధిస్తారు. విదేశాల నుంచి ఆశించిన శుభ వార్త అందుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. వృత్తి జీవితం బిజీగా పురోగమిస్తుంది. ఏ ప్రయత్నం చేపట్టినా విజయం సాధించే అవకాశముంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యక్తి గత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఇతరులతో, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వాదోపవాదా లకు దిగి ఇబ్బందిపడే సూచనలున్నాయి. బంధువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో అప్రయత్నంగా లాభాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా మారుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశముంది. ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారే అవకాశం ఉంది. మనసులోకి కోరికలు నెరవేరుతాయి. కష్టార్జితం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు పెరిగి బాగా ఇబ్బంది పడతారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొత్త ప్రయత్నాలు చేపడతారు. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి కాస్తంత ఎక్కువగా కృషి చేస్తారు. తోబుట్టువులకు ఆర్థికంగా అండగా నిలబడతారు. వ్యాపారాల్లో లాభాలపరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యు లతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చాలావరకు చక్కబెడతారు. కొద్ది వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు. ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరుతాయి. ఆదాయ మార్గాలు బాగా కలిసి వస్తాయి. శత్రు, రోగ, రుణ బాధలు బాగా తగ్గి ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన ఆశించినంతగా బాగా పెరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. పనితీరుతో, ప్రతిభతో అధికారులను బాగా ఆకట్టుకుంటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు బాగా రాణిస్తాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. కొందరు పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. విదేశాల నుంచి మంచి ఆఫర్లు అందుతాయి. విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. మిత్రులకు సహాయం చేస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి శుభవార్త వింటారు. వృత్తి, వ్యాపారాల మీద శ్రద్ధ పెంచుతారు. కొందరు ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల లాభ ముంటుంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం, ఆరోగ్యం అనుకూలంగా ఉంటాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరిగినప్పటికీ, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపా రాలు నిలకడగా పురోగమిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెట్టడంలో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. బంధు మిత్రులు మీ సలహాలు, సూచనల వల్ల లబ్ధి పొందుతారు. ఆదాయానికి లోటుండకపోవచ్చు. కొందరు సహో ద్యోగులతో అకారణ శత్రుత్వం ఏర్పడే అవకాశముంది. ప్రయాణాల్లో ప్రమాదాలు ఎదురుకావచ్చు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు వృద్ధి చెందే అవకాశముంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయి లాభాలు కనిపిస్తాయి. అన్ని విధాలుగానూ సంపాదన పెరుగుతుంది. కొందరు మిత్రుల వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే సూచనలు న్నాయి. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రతిభా పాట వాలకు సరైన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి.

Also Read: ఈ రాశుల జాతకం మారుతుంది.. ఇక జీవితంలో దశ తిరిగినట్టే..!

Follow Us