
దిన ఫలాలు (జూలై 24, 2026): మేష రాశి వారు ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో రోజంతా అనుకూలంగా గడిచిపోతుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆశించిన ప్రోత్సాహకాలను అందుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఉద్యోగంలో మార్పులకు, ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. అధికారులు ప్రత్యేక బాధ్యతల్ని అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మీ నిర్ణయాలు, మీ ఆలోచనలు కార్యరూపంలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆదాయపరంగా దాదాపు ప్రతి ప్రయత్నం అను కూలిస్తుంది. జీవిత భాగస్వామికి కూడా వృత్తి, ఉద్యోగాల పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది.
శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో రోజంతా అనుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు గడించే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. విదేశాల్లో ఉంటున్న పిల్లలు ఇంటికి రావడం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆశించిన ప్రోత్సాహకాలను అందుకుంటారు. వ్యాపారాల్లో లాభాలకు ఢోకా ఉండదు. ఆదాయ ప్రయత్నాలకు ప్రాధాన్యమిస్తారు. అనుకోని ఖర్చులతో ఇబ్బంది పడతారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రయత్నాలకు అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి ఉద్యోగంలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎంతో శ్రమతఓ ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి మీ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఇబ్బందికర వ్యవ హారాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక బాధ్యతలను ఎవరికీ అప్పగించవద్దు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాలి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది. చిన్న ప్రయత్నంతో మంచి లాభాలను పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాలకు ఇది అనుకూల సమయం. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో మిత్రుల సహాయం అందుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి తేలికగా పరిష్కారమవుతుంది. మనసులోని కోరిక నెరవేరుతుంది.
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. సమయం చాలావరకూ అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వ్యాపారాలు లాభాల పంట పండిస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది కానీ, విందులు, విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. రాదని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవు తాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. కుటుంబ జీవితం బాగా సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.
ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. వృత్తి జీవితం సాదా సీదాగా సాగిపో తుంది. వ్యాపారాల్లో లాభాలు పరవాలేదనిపిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు తగిన స్పందన లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోయే అవకాశముంది. వృథా ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు, వ్యవహా రాలు పూర్తవుతాయి. ఆస్తి వివాదం విషయంలో శుభవార్త వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
రోజంతా ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలో ఒత్తిడి నుంచి ఉపశ మనం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవ కాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. దైవ కార్యాల మీద బాగా ఖర్చు చేస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచడానికి వీలుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాల మీద ఆధారపడడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.
ఉద్యోగ జీవితంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమి స్తాయి. కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆరోగ్యానికి లోటుండదు. అయితే, ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆశించిన శుభవార్త అందుతుంది.
ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపడ తారు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఒకటి రెండు వ్యక్తి గత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
వృత్తి, ఉద్యోగాల్లో మీ శక్తిసామర్థ్యాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా పురోగమిస్తాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. బంధుమిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.