ఆగస్టు 30 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థికంగా కలిసొచ్చే రోజు.. మీ రాశి ఉందా?

Horoscope Today (August 30, 2026): ఆదివారం 12 రాశుల వారికి గ్రహాల ప్రభావం భిన్నంగా ఉండనుంది. మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండటంతో పాటు ఉద్యోగం, వివాహ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభించే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగ, వృత్తి రంగాల్లో ఒత్తిడి పెరగవచ్చు. మిథున రాశి వారికి కొత్త ప్రాజెక్టులు చేతికి వచ్చే అవకాశం ఉండగా, వ్యాపారంలో సొంత నిర్ణయాలు అనుకూల ఫలితాలు ఇవ్వవచ్చు. మరి మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ఆగస్టు 30 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థికంగా కలిసొచ్చే రోజు.. మీ రాశి ఉందా?
Horoscope Today 30 August 2026

Edited By:

Updated on: Aug 30, 2026 | 6:00 AM

దిన ఫలాలు (ఆగస్టు 30, 2026): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది.
వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అదనపు బాధ్యతలు నిర్వర్తిం చాల్సి వస్తుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు చేతికి వచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో మీ కృషికి, మీ ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర రంగాలవారికి సంపాదన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితాలుంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచడం మంచిది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్ని నింపుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లలు చదువుల మీద దృష్టి పెడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొం టారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగుతుంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు చేతికి వచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఇష్టమైన వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆశించిన శుభవార్త అందు తుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఒకటి రెండు కుటుంబ సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆర్థిక విషయాల్లో బంధువులకు వాగ్దానాలు చేసి ఇబ్బంది పడతారు. ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. చేపట్టిన వ్యవహారాలను పూర్తి చేయడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో శ్రమ, తిప్పట మిగులుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడు తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. పెళ్లి సంబంధాల విషయంలో బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. ఆర్థికంగా లాభాలు అందుతాయి. వ్యవహార జయానికి, కార్యసిద్ధికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహా రాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. నిరుద్యోగులు ఒకటి రెండు శుభవార్తలు అందుకుంటారు.

కన్య ( ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాలలో పని భారం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటి విషయాల్లో జీవిత భాగ స్వామితో కూడా సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చేపట్టిన వ్యవ హారాలు త్వరిత గతిన పూర్తవుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెంచడానికి ఇది సమయం కాదు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాలు నిర్వహిస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా వైభవం పెరుగుతుంది. మీ సలహాలు, సూచనలు అధికారులకు బాగా ఉపయోగపడతాయి. ఇతరుల నుంచి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి, కొత్త అవకాశాలు అంది వస్తాయి. వ్యాపారాలు ఆశించినట్టు లాభసాటిగా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారులు మెప్పు పొందుతారు. ఆదాయం, ఆరోగ్యం బాగా అనుకూలంగా, మెరుగ్గా ఉంటాయి. అవసరానికి డబ్బు అందుతుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. రోజంతా మీరు అనుకున్న విధంగా సాగుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సత్ఫలితాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా, లాభదాయకంగా సాగిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. మిత్రుల సాయంతో ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు. కొన్ని వ్యక్తిగత వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో గానీ పూర్తికావు. కుటుంబ జీవితం ఆనందోత్సాహాలతో సాగిపోతుంది. ప్రయాణాలు లాభిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో అధికారులు మీ సలహాలు, సూచనల వల్ల లబ్ధి పొందుతారు. వ్యాపారాల్లో లావాదే వీలు, కార్యకలాపాలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడు తుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి. అధికారుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపా రాల్లో ఒకటి రెండు సమస్యలున్నా నిదానంగా సర్దుకుంటాయి. చేపట్టిన ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. కొందరు స్నేహితుల వల్ల డబ్బు న‌ష్టపోయే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, అనుకోని ఖర్చుల్ని భరించాల్సి వస్తుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహంగా పనిచేసి శుభ ఫలితాలను పొందడం జరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. అన్ని రంగాలవారికి సమయం కాస్తంత అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఒకటి రెండు కీలకమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక శుభకార్యానికి ప్లాన్ చేస్తారు. బంధువుల్ని కలుసుకుంటారు. కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us