రాశి ఫలాలు (15 ఏప్రిల్ 2026): కొందరికి ధనలాభం.. మరికొందరికి పని ఒత్తిడి!

Daily Horoscope in Telugu (April 15, 2026): బుధవారంనాటి రాశిఫలాల ప్రకారం మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొందరికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు లభిస్తే, మరికొందరికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలు చాలావరకు సానుకూలంగా ఉండగా, సరైన నిర్ణయాలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది.

రాశి ఫలాలు (15 ఏప్రిల్ 2026): కొందరికి ధనలాభం.. మరికొందరికి పని ఒత్తిడి!
Rashifal In Telugu 15 April 2026

Edited By:

Updated on: Apr 15, 2026 | 5:45 AM

దిన ఫలాలు (ఏప్రిల్ 15, 2026): మేష రాశి వారు కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృషభ రాశి వారికి వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. మిథున రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో భారీ లక్ష్యాలను పూర్తి చేయాల్సి వస్తుంది. ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకోవడం సంతోషాన్నిస్తుంది. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో చిక్కులు, సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు, మార్పుల్ని అమలు చేస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. దగ్గర బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో సానుకూలంగా ఉంటాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో భారీ లక్ష్యాలను పూర్తి చేయాల్సి వస్తుంది. ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆస్తి వ్యవహారాలను చక్కబెడతారు. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపారాలు బాగా సానుకూలంగా సాగిపోతాయి. బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రయత్నాల వల్ల ఆశించిన లాభాలు చేకూరుతాయి. ఉద్యోగం సంపాదించడానికి, ఉద్యోగం మారడానికి మార్గం సుగమమవుతుంది. కొద్దిపాటి ధన నష్టానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ, లక్ష్యాలు, బాధ్యతల్ని సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. మొత్తానికి రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. తలపెట్టిన పనులు, వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో ఉంటుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారంలో ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. అనుకోకుండా ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. బంధు వుల్లో పెళ్లి సంబంధం కుదరవచ్చు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగి విశ్రాంతి లభించని పరిస్థితి ఏర్పడుతుంది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆశించిన ప్రయోజనం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలుసాధిస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. వ్యాపారం అభివృద్ధి చెందడం ప్రారంభిస్తుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీ నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయానికి లోటుండదు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

తలపెట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపార వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు అనుకోకుండా కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక పురోగతికి బాగా అవకాశముంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో వైద్యుడిని సంప్రదించాల్సి వస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొందరు మిత్రుల వల్ల డబ్బు వృథా కావడం లేదా నష్టపోవడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు నిదానంగా పూర్తవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. సామాజిక సేవా కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చాలావరకు అనుకూలిస్తాయి. పెళ్లి ప్రయత్నాలను వాయిదా వేయడం మంచిది. ఉద్యోగం మారడానికి బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి ఇది అనుకూల సమయం. ఇంటా బయటా ప్రాధాన్యం పెరుగుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి.

Follow Us