Horoscope Today: 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు.. వారికి ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది..!

| Edited By: Shaik Madar Saheb

Sep 20, 2023 | 6:34 AM

మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశముంది. వృషభ రాశివారు ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. మిథున రాశివారి సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. మేష రాశి మొదలుకుని మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారం (20 సెప్టెంబర్, 2023) దినఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు.. వారికి ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది..!
Horoscope Today
Follow us on

Daily Horoscope(20 Sep 2023): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశముంది. వృషభ రాశివారు ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. మిథున రాశివారి సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. మేష రాశి మొదలుకుని మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారం (20 సెప్టెంబర్, 2023) దినఫలాలు ఎలా ఉన్నాయంటే..?

  1. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కొత్త లక్ష్యాలు, కొత్త ప్రాజెక్టుల కారణంగా బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉన్నప్పటికీ, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామితో సామరస్యం పెరుగు తుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.
  2. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా అది విజయవంతంగా పూర్తవుతుంది. బంధుమిత్రులతో సఖ్యత, సామరస్యం పెరుగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే ఆలోచనలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో సమర్థమైన పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి వస్తుంది. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
  3. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యో గులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల్ని చాలావరకు పరి ష్కరించుకుంటారు. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. స్నేహ సంబంధాలు అధికం అవుతాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి.
  4. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగంలో కొన్ని మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు పెరిగే సూచనలు న్నాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. వ్యాపారాలు ప్రారంభించే అవకాశం కూడా ఉంది. ఆదాయ మార్గాలు పెరిగే అవ కాశం ఉంది. కుటుంబపరంగా పురోగతికి అవకాశం ఉంది. ఇంటా బయటా పరిస్థితులు అనుకూ లంగా ఉంటాయి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి.
  5. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఆర్థిక ప్రయత్నాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యోగులు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. విద్యార్థులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి.
  6. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. ఉద్యోగంలో మంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కొందరు దూరపు బంధువులను కలుసుకుంటారు. స్నేహితులు, సన్నిహితులతో విందులో పాల్గొంటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తుతాయి.
  7. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలను చాలావరకు చక్కబెడతారు. వ్యక్తిగత సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ఉల్లా సంగా ముందుకు సాగుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందు కుంటారు. చదువుల్లో విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
  8. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి కానీ, ఉద్యోగంలో పని భారం పెరిగి కొద్దిగా ఇబ్బంది పడతారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాల నుంచి ఆశించిన ప్రయోజనాలు లభిస్తాయి. కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయా ణాల్లో వాహన ఇబ్బందులు కలగవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్త వుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది కలిగిస్తాయి.
  9. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ఆర్థిక సమస్యల నుంచి, నష్టాల నుంచి కొంతవరకు బయటపడ తాయి. ఉద్యోగంలో అధికారుల బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యానికి ఢోకా లేదు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకుపోతారు.
  10. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): కుటుంబ పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆస్తి విలువ పెరిగినట్టు సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల అండతో పదోన్నతి లభిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు రొటీన్ గా సాగిపోతాయి.
  11. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతలు ఉంటాయి. ముఖ్య మైన ప్రయత్నాలు పాక్షికంగా నెరవేరుతాయి. కొద్దిపాటి అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. కీలక వ్యవహారాలు శ్రమ మీద పూర్తవుతాయి. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి ఇబ్బందులు పడడం జరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు ఏర్పడతాయి.
  12. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఒకటి రెండు ముఖ్యమైన వివాదాలు, సమస్యల నుంచి సమయస్ఫూర్తితో బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగు తాయి. దైవ కార్యాలకు ఆర్థికంగా సహాయపడతారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఎవరికీ హామీలు ఉండవద్దు. విద్యార్థులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.