Horoscope Today: వారి జీవితాల్లో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Sep 12, 2023 | 5:01 AM

మేష రాశికి చెందిన వారు తొందరపాటుగా వ్యవహరించడం మంచిదికాదు. వృషభ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో దూసుకుపోతారు. మిథునం రాశివారు ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. 12 రాశుల వారికి మంగళవారం (12వ తేదీ సెప్టెంబర్, 2023) రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారి జీవితాల్లో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 12th September 2023
Follow us on

Daily Horoscope(12 Sep): మేష రాశికి చెందిన వారు తొందరపాటుగా వ్యవహరించడం మంచిదికాదు. వృషభ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో దూసుకుపోతారు. మిథునం రాశివారు ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. 12 రాశుల వారికి మంగళవారం (12వ తేదీ సెప్టెంబర్, 2023) రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

  1. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): కొద్దిగా ఓర్పు సహనాలతో వ్యవహరిస్తే పనులన్నీ సానుకూలంగా పూర్తవుతాయి. తొందరపాటుగా వ్యవహరించడం మంచిది కాదు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త అందుకుంటారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి ఆశించిన సమాచారం అందుతుంది.
  2. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, ఉద్యోగాల్లో దూసుకుపోతారు. వ్యాపారాల్లో లాభాలకు కొదవ ఉండదు. నిరుద్యోగులకు సాను కూల స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామి కూడా ఆశించిన పురోగతిని చూస్తారు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలుంటాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నాలుగవ స్థానంలో ఏర్పడిన బుధాదిత్య యోగం వల్ల సమాజంలో మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ప్రముఖు లతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లి విరుస్తాయి.
  3. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఆదాయ మార్గాలు మరింతగా మెరుగుపడతాయి. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగి పోతుంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
  4. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఈ రాశిలో ఉన్న శుక్రుడు, ద్వితీయ స్థానంలో ఏర్పడిన బుధాదిత్య యోగం వల్ల కొన్ని శుభ ఫలి తాలు అనుభవానికి వస్తాయి. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. అద నపు ఆదాయ మార్గాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. విలాసాలకు, వ్యసనా లకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. కొందరు స్నేహి తులు నమ్మించి మోసం చేసే అవకాశం ఉంది. ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది.
  5. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఈ రాశివారికి సమయం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఏ రంగానికి చెందినవారైనప్పటికీ వ్యక్తిగతంగా తప్పకుండా పురోగతి ఉంటుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది.
  6. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, ఉద్యోగాలపరంగా అనుకోకుండా కొన్ని చిక్కులు ఎదురవుతాయి. అధికారుల నుంచి ఒత్తిళ్లు, వేధింపులు ఉండే అవకాశం ఉంది. దూర ప్రాంతాలకు బదిలీ చేసే సూచనలు కూడా ఉన్నాయి. కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగు తాయి. నిరుద్యోగులు ఆశించిన సమాచారం వినే అవకాశం ఉంది. దూరపు బంధువుల్లో పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ఎవరికీ హామీలు ఉండవద్దు.
  7. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ రాశివారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం అయినా సానుకూల ఫలితాలను ఇస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో మీ ఆలోచనలు, వ్యూహాల వల్ల అధికారుల నుంచి అభినం దనలు అందుకుంటారు. వ్యాపారాల్లో కూడా మీ ఆలోచనలు సఫలం అవుతాయి. ఆదాయ మార్గాలు విస్తృతం అవుతాయి. కుటుంబ వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
  8. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): వృత్తి, ఉద్యోగాల్లో ఏకపక్షంగా వ్యవహరించడం మంచిది కాదు. అందరినీ కలుపుకుని వెళ్లడం వల్ల ఆశించిన ఫలితాలు చేతికి అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు క్రమంగా చక్కబడడం ప్రారంభి స్తాయి. ఆదాయం అనుకూలంగా ఉన్నప్పటికీ ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కుటుంబంలో ఒకటి రెండు సమస్యలు తలెత్తవచ్చు. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
  9. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగావకాశాలు మెరు గుపడడంతో పాటు, ఉద్యోగం మారే అవకాశాలు కూడా మెరుగుపడతాయి. మంచి ఆఫర్లు అందు తాయి. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టి ప్రయోజనం పొందుతారు. వ్యాపారావకాశాలు కూడా పెరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజ నాలు కనిపిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.
  10. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ సమేతంగా దైవదర్శనాలు చేసుకుం టారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కొందరు స్నేహితుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
  11. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ప్రతి పనిలోనూ కొద్దిగానైనా శ్రమ, తిప్పట ఉంటాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మీరు ఇవ్వాల్సిన వారికి డబ్బు తిరిగి ఇచ్చేయడం జరుగు తుంది. ఇతరత్రా కూడా ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది.
  12. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లోనూ, సామాజిక సేవల్లోనూ పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. లక్ష్యాలు లేదా ప్రాజెక్టు పనులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఆదాయం బాగానే ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండ వద్దు.

Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.