
ప్రతి గ్రహం తనదైన ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది. సూర్యుడి ఆత్మవిశ్వాసం, కుజుడి బలం తోడైతే ఎదురులేని విజయం లభిస్తుంది. ఫిబ్రవరిలో జరిగే ఈ సంయోగం వల్ల ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో గోల్డెన్ ఛాన్సెస్ రానున్నాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి లేదా కొత్త ఆస్తులు కొనాలనుకునే వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మీ రాశి ఇందులో ఉందో లేదో సరిచూసుకోండి గ్రహాల అనుకూలత కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి.
మేష రాశి: ఈ రాశి అధిపతి కుజుడు కావడంతో వీరికి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కొత్త బాధ్యతలు చేపట్టడం ద్వారా అధికారుల ప్రశంసలు పొందుతారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఇది మంచి సమయం.
మిథున రాశి: కెరీర్‌లో ఊహించని మార్పులు వస్తాయి. వ్యాపారస్తులు భారీ లాభాలను ఆర్జిస్తారు. మీ సృజనాత్మక ఆలోచనలకు కార్యాలయంలో గుర్తింపు లభిస్తుంది.
సింహ రాశి: సింహ రాశి అధిపతి సూర్యుడు. ఈ సంయోగం వల్ల వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రభుత్వ పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగి విజయం వరిస్తుంది.
తులా రాశి: ఆర్థికంగా ఈ రాశి వారికి చాలా బలంగా ఉంటుంది. వృత్తిపరమైన జీవితంలో పురోగతి కనిపిస్తుంది. క్లిష్టమైన నిర్ణయాలను సులభంగా తీసుకుని సక్సెస్ అవుతారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిహారాలు:
కుజుడి ప్రభావం వల్ల కోపం పెరిగే అవకాశం ఉన్నందున, దానిని నియంత్రించుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాలంలో ప్రతిరోజూ ఉదయం సూర్యుడికి ‘అర్ఘ్యం’ సమర్పించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే హనుమంతుడిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం వల్ల గ్రహ దోషాలు తొలగి మనశ్శాంతి లభిస్తుంది. భూమి లేదా ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలించుకోవడం మంచిది.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. ఈ వివరాలు జ్యోతిష్య శాస్త్ర నమ్మకాలపై ఆధారపడి ఉన్నాయి, దీనికి శాస్త్రీయ ఆధారం లేదు. దీనికి సంబంధించి ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం. సంస్థ దీనికి బాధ్యత వహించదు.