Zodiac Signs: రెండు రోజుల పాటు అరుదైన గ్రహ స్థితి.. వారికి జీవితంలో ఆకస్మిక సానుకూలత తథ్యం..!

| Edited By: Janardhan Veluru

Jun 09, 2023 | 6:05 PM

Astrology in Telugu: ఈ నెల 10, 11 తేదీలలో అరుదైన గ్రహస్థితి చోటు చేసుకోబోతోంది. రెండేసి గ్రహాలు చొప్పున నాలుగు రాశుల్లో 8 గ్రహాలు కలవడం జరుగుతుంది. గ్రహ సంచారం ప్రకారం ఇది ఒక గొప్ప విశేషం. కుంభరాశిలో శని, చంద్రులు, మేషరాశిలో గురు, రాహు గ్రహాలు, వృషభ రాశిలో రవి, బుధులు, కర్కాటకంలో కుజ, శుక్ర గ్రహాలు కలవటం సాధారణంగా శుభ ఫలితాలనే ఇస్తుంది.

Zodiac Signs: రెండు రోజుల పాటు అరుదైన గ్రహ స్థితి.. వారికి జీవితంలో ఆకస్మిక సానుకూలత తథ్యం..!
Zodiac Signs
Follow us on

Astrology in Telugu: ఈ నెల 10, 11 తేదీలలో అరుదైన గ్రహస్థితి చోటు చేసుకోబోతోంది. రెండేసి గ్రహాలు చొప్పున నాలుగు రాశుల్లో 8 గ్రహాలు కలవడం జరుగుతుంది. గ్రహ సంచారం ప్రకారం ఇది ఒక గొప్ప విశేషం. కుంభరాశిలో శని, చంద్రులు, మేషరాశిలో గురు, రాహు గ్రహాలు, వృషభ రాశిలో రవి, బుధులు, కర్కాటకంలో కుజ, శుక్ర గ్రహాలు కలవటం సాధారణంగా శుభ ఫలితాలనే ఇస్తుంది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఏదో ఒక విషయంలో స్థిరత్వం లభించడం, ప్రశాంతత నెలకొనడం, పరిస్థితి ఆశాజనకంగా మారటం వంటివి జరిగే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా లేదా కుటుంబ పరంగా కూడా ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు ఆశాజనకంగా మారే అవకాశం ఉంటుంది. వివిధ రాశులకు ఇది ఏ విధంగా పనిచేస్తుందో ఇక్కడ పరిశీలిద్దాం.

  1. మేష రాశి: ఈ రాశి వారికి ఈ కలయిక ఉద్యోగపరంగా తప్పకుండా స్థిరత్వాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో సంతృప్తికరమైన మార్పులు చోటు చేసుకుం టాయి. వృత్తి ఉద్యోగాలపరంగా చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఒకటి రెండు శుభ పరిణా మాలు ఇప్పుడు అనుభవానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం మారాలన్న నిర్ణయాన్ని కూడా మార్చుకొని ప్రస్తుతం ఉన్న ఉద్యోగం లోనే పురోగతి సాధించే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా చాలావరకు చక్కబడుతుంది.
  2. వృషభ రాశి: ఈ రాశి వారికి కుటుంబ జీవితం చాలా వరకు ప్రశాంతంగా మారుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించినంతగా ప్రయోజనం చేకూరుతుంది. కుటుంబ సభ్యులకు లేదా జీవిత భాగస్వామికి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా మారుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా సరైన చికిత్స లేదా వైద్య సౌకర్యం అందుబాటులోకి రావడం జరుగుతుంది. మొత్తం మీద జీవితం కొద్దిగా సంతృప్తికరంగా కనిపిస్తుంది.
  3. మిథున రాశి: ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు ఆశాజనకంగా కనిపిస్తాయి. సంపాదన పెరగటం, గుర్తింపు లభించడం, ఉన్నత స్థానానికి వెళ్లే సూచనలు కనిపించడం వంటివి జరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో తప్పకుండా స్థిరత్వం లభిస్తుంది. జీవితానికి ఉపయోగపడే పరిచయాలు ఏర్పడతాయి. సంతాన పరంగా పురోగతి ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒక రకమైన ఫీల్ గుడ్ వాతావరణం అనుభవానికి వస్తుంది. ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయము మంచి ఫలితాలను ఇస్తుంది.
  4. కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఉద్యోగంలో తప్పకుండా స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యక్తిగతంగా కూడా సంతృప్తికర మైన జీవితం అనుభవించడానికి మార్గం సుగమం అవుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారం స్వయం ఉపాధి వంటివి ఆశాజనకంగా మారుతాయి. సంతా నంలో ఒకరికి గొప్ప అదృష్ట యోగం పడుతుంది. శుభ పరిణామాలు చోటు చేసుకోవడం, శుభ వార్తలు వంటివి తప్పకుండా చోటు చేసుకుం టాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అపనిందలు అపవాదులు తొలగిపోతాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహ రాశి: ఈ సరికొత్త కలయిక ద్వారా సింహ రాశి వారి జీవితంలో కొద్దిగా సానుకూల మార్పులు సంభ వించే అవకాశం ఉంది. విదేశీయానానికి సంబం ధించిన సమస్యలు తొలగిపోయే సూచనలు ఉన్నాయి. తల్లిదండ్రుల కారణంగా సంపద పెరిగే అవకాశం ఉంది. వృత్తి స్థిరత్వానికి, ఆర్థిక స్థిర త్వానికి చాలావరకు సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారం సాఫీగా సాగిపోతుంది. ఇంటి పరిస్థితులు, వంటి పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది.
  7. కన్యా రాశి: ఈ రాశి వారికి 10, 11వ తేదీలలో కొన్ని ముఖ్య మైన సమస్యలు స్వయంకృషితో పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. తోబుట్టువు లతో వివాదాలు పరిష్కారం అవుతాయి. నిశ్చింతగా, సంతృప్తికరంగా జీవితం గడపటానికి అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత కుటుంబ సమస్యలు అనుకోకుండా పరిష్కారమై మన శ్శాంతి ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజన కంగా మారుతుంది. స్నేహితుల నుంచి అండదండలు లభిస్తాయి.
  8. తులా రాశి: ఈ రకమైన గ్రహాల కలయిక ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో స్థిరత్వాన్ని అందిస్తుంది. వ్యాపా రంలో భాగస్వాములతో విభేదాలు సమసి పోతాయి. లాభాల పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడుతుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తి నిపుణులకు గిరాకీ పెరుగుతుంది. ఐటీ రంగం వారికి ఉద్యోగ అవకాశాలు బాగా మెరుగుపడతాయి. చిన్న ప్రయత్నాలతో విశేష ప్రయోజనాలు అనుభవానికి వస్తాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది.
  9. వృశ్చిక రాశి: ఈ రాశి వారికి సంపాదన ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభి స్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చొరవ, దృఢ సంకల్పం, గట్టి ప్రయత్నం వంటివి చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన పనులు వేగంగా విజయవంతంగా పూర్తయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబ బాధ్యతలను సమ ర్థంగా నిర్వర్తించడం జరుగుతుంది. అనారోగ్యం నుంచి బయటపడటానికి గట్టి కృషి ప్రారంభం అవుతుంది. పిల్లలు పురోగతి సాధించడానికి అవకాశం ఉంది.
  10. ధనూ రాశి: ఈ రాశి వారికి సంతాన పరంగా మానసిక సంతృప్తి లభిస్తుంది. పిల్లల్లో ఒకరికి మంచి ఉద్యోగం లభించడం లేదా మంచి పెళ్లి సంబంధం కుదరటం, చదువుల్లో పురోగతి చెందడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారి సలహాలకు, సూచనలకు విలువ పెరుగుతుంది. అంతేకాక, వీరి ఆలోచనలు, నిర్ణయాలు తప్పకుండా ఆశించిన ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. కుటుంబ సమస్యలు తొలగిపోవటంతో పాటు దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.
  11. మకర రాశి: ఈ రాశి వారికి శని చంద్రులు, బుధ, రవులు, కుజ శుక్రులు కలవటం అనేది జీవితంలో కొన్ని సానుకూల ఆకస్మిక పరిణామాలను సూచిస్తుంది. కిక్ స్టార్ట్ లాగా హఠాత్తుగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం, ఉద్యోగంలో ఒక మెట్టు పైకి వెళ్ళటం వంటివి తప్పకుండా జరిగే అవకాశం ఉంది. మనసులోని ముఖ్యమైన కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది. ఆర్థికంగా కలిసి రావడం ప్రారంభం అవుతుంది. మొత్తం మీద ఒక విధమైన ఆత్మస్థైర్యానికి, మనశ్శాంతికి అవకాశం ఉంది.
  12. కుంభ రాశి: ఈ రాశి ఈ జీవితంలో ఈ రెండు రోజుల కాలంలో ఎన్నడూ చూడని, ఎన్నడూ ఎరగని శుభ పరి ణామం ఒకటి సంభవించే అవకాశం ఉంది. దీనివల్ల వ్యక్తిగత జీవితం ఒక్కసారిగా మెరుగు పడటంతో పాటు ఒకటి రెండు సమస్యల పరి ష్కారానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. తప్పకుండా అదృష్టం తలుపు తడుతుందని చెప్పవచ్చు. ఆరోగ్య పరిస్థితి కూడా అప్రయ త్నంగా మెరుగుపడుతుంది. ఉద్యోగ వాతావ రణం లో కూడా అనుకోని విధంగా సానుకూల మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది.
  13. మీన రాశి: ఈ రాశి వారికి ఆదాయపరంగా, లాభాలపరంగా, సంపాదనపరంగా మంచి స్థిరత్వం లభిస్తుంది. ఊహించని మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ పరిస్థితి ఆశాజనకంగా మారుతుంది. కుటుంబ సభ్యులు వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. శుభకార్యాలకు ప్లాన్ చేసుకోవడం జరగ వచ్చు. జీవిత భాగస్వామికి సంపద పెరుగు తుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వినే సూచనలు ఉన్నాయి. ఆదాయపరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా మనశ్శాంతి ఏర్పడుతుంది.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..