Horoscope Today: ఆ రాశివారికి అనవసర ఖర్చులు పెరుగుతాయి.. 12 రాశుల వారికి నేటి (09 జూన్) రాశిఫలాలు
Horoscope Today (09th June 2023): ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి పూర్తి వివరాలతో 12 రాశుల వారికి శుక్రవారం (జూన్ 9వ తేదీ)నాటి దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
Horoscope Today (09th June 2023): ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి పూర్తి వివరాలతో 12 రాశుల వారికి శుక్రవారం (జూన్ 9వ తేదీ)నాటి దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం చాలావరకు నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. మితిమీరిన ఔదార్యంతో ఇబ్బంది పడతారు. బంధుమిత్రుల నుంచి సహాయం లభిస్తుంది. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో సహచరుల పనులను కూడా మీరే పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు కొద్దిగా లాభాలు ఆర్జిస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అధికారులు బాగా ఆదరిస్తారు. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్థిస్తారు. కుటుంబంలో కొద్దిగా చికాకులు తలెత్తుతాయి. సంతానం పురోగతి సాధిస్తారు. ఖర్చుల్ని బాగా తగ్గించుకోవాలి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులు శ్రమ మీద మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకుంటుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సమస్య ఒకటి బంధువుల సహకారంతో పరిష్కారం అవుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది కానీ అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. వ్యాపారులకు అన్ని విధాల కలిసి వస్తుంది. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. పరిచయస్తులలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వ్యాపారులకు ఆర్థికంగా పర్వాలేదు. వృత్తి నిపుణులు నిలదొక్కుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ కి అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. రుణ సమస్య తగ్గుతుంది. పెళ్లి సంబంధం కాయం అవుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మంచి కుటుంబంలో పెళ్లి సంబంధంకుదురుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఐటీ రంగంలోని వారు అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా ఆశాజనకంగా ఉండదు. ఎవరికీ వాగ్దానాలు చేయకండి. ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. కొందరు బంధువులు ఇబ్బంది పెడతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇతరులకు బాగా సహాయపడతారు. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. రాదనుకున్న డబ్బుచేతికి వస్తుంది. స్నేహితులు అండగా నిలుస్తారు. బంధువర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారంలో కొద్దిగా లాభాలు సంపాదిస్తారు. ఇరుగుపొరుగుతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): ఉద్యోగంలో అధికారులు కొద్దిగా ఇబ్బంది పెడతారు. ఆదాయం పర్వాలేదు. ఆరోగ్యం జాగ్రత్త. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారం నిలకడగా కొనసాగుతుంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వృత్తి వ్యాపారాల వారి పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో మితిమీరిన శ్రమ, ఒత్తిడి ఉంటాయి. అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి. ఆదాయంలో కొద్దిగా మాత్రమే పెరుగుదల ఉంటుంది. ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా ఒకరిద్దరు స్నేహితులను ఆదుకుంటారు. పెళ్లి సంబంధం కుదరకపోవచ్చు. సంతానం పురోగతి సాధిస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. తిప్పట ఉన్నప్పటికీ అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఒక బంధువు ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాల వారికి సమయం బాగుంది. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. అయితే ఎక్కడా పెట్టుబడులు పెట్టవద్దు.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. ఇంటా బయటా కొన్ని చికాకులు ఉన్నప్పటికీ ఏదో విధంగా నెట్టుకొస్తారు. ఆరోగ్యం పరవాలేదు. సన్నిహితులకు సహాయం చేస్తారు. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. కొన్ని బకాయిలు వసూలు అవుతాయి. పెళ్లి సంబంధం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. మిత్రుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వీలైనంతగా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఊహించని విధంగా కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల వారికి ఇది అనుకూల సమయం. అనుకున్న పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..